ETV Bharat / bharat

హత్య కేసులో బెయిల్​పై రిలీజ్​.. పెళ్లికి ఒప్పుకోలేదని గర్ల్​ఫ్రెండ్​ దారుణ హత్య - గర్ల్​ఫ్రెండ్​ను హత్య చేసిన యువకుడు

Man murders girlfriend: హత్యకేసులో బెయిల్​పై విడుదలైన ఓ వ్యక్తి.. తనతో పెళ్లికి ఒప్పుకోలేదని యువతిని హత్య చేశాడు. ఈ ఘటన పంజాబ్​లోని గురుదాస్​పుర్ జిల్లా​ సైన్​పుర్​ గ్రామంలో జరిగింది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

murder
హత్య
author img

By

Published : May 12, 2022, 5:28 PM IST

Man murders girlfriend: బెయిల్​పై జైలు నుంచి బయటకు వచ్చిన ఓ వ్యక్తి తనతో పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువతిని దారుణంగా హత్య చేశాడు. పంజాబ్​లోని సైన్​పుర్​ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ జరిగింది.. గురుదాస్​పుర్​ జిల్లా సైన్​పుర్​ గ్రామానికి చెందిన పూజ, నిందితుడు రాహుల్​ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల రాహుల్​ హత్యాయత్నం చేశాడన్న ఆరోపణలపై జైలుకు వెళ్లి బెయిల్​పై తిరిగివచ్చాడు. అతడికి క్రిమినల్​ బ్యాక్​గ్రౌండ్​ ఉండటం వల్ల పూజ.. బెయిల్​పై తిరిగి వచ్చిన రాహుల్​తో పెళ్లికి నిరాకరిస్తున్నట్లు చెప్పింది. దీంతో ఆగ్రహం చెందిన రాహుల్​ అతడి స్నేహితుడి సాయంతో ఆమె ఇంట్లోకి చొరబడి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితులు పరారయ్యారు. ఈ విషయాలను పూజ సోదరి రజని బాలా వెల్లడించింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్​మార్టంకు తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: 'తాజ్​మహల్​లో హిందూ దేవతా విగ్రహాలు' పిటిషన్ కొట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.