ETV Bharat / bharat

Mulugu Accident: పోలీసు జీపు బోల్తా.. డ్రైవర్ సహా ఎస్సై మృతి - రోడ్డు ప్రమాదంలో ఎస్​ఐ మృతి

Mulugu Accident
Mulugu Accident
author img

By

Published : May 2, 2023, 3:35 PM IST

Updated : May 2, 2023, 4:51 PM IST

15:30 May 02

Mulugu Accident: పోలీసు జీపు బోల్తా.. డ్రైవర్ సహా ఎస్సై మృతి

Mulugu Accident
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్​ఐ ఇంద్రయ్య

Mulugu Accident: ములుగు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏటూరు నాగారం మండలం జీడివాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న ఎస్సై సహా మరో వ్యక్తి మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. ములుగు జిల్లా ఏటూరు నాగారం సెకండ్ ఎస్​ఐ బి. ఇంద్రయ్య, కానిస్టేబుల్ మెట్టు శ్రీనివాస్ విధి నిర్వహణలో భాగంగా పోలీస్ వాహనమైన బొలెరోలో ఓ ప్రైవేటు డ్రైవర్ రాజుతో కలిసి మంగపేట వెళ్తున్నారు. దురదృష్టవశాత్తు జీడివాగు సమీపంలో అదుపుతప్పి వాహనం బోల్తా కొట్టింది.

ఈ ఘటనలో ఎస్​ఐ ఇంద్రయ్య, డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందారు. కానిస్టేబుల్ శ్రీనివాస్​కి స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఏటూరు నాగారం మరో ఎస్​ఐ రమేష్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. అలాగే జిల్లాలో ఆకస్మిక తనిఖీల్లో ఉన్న ఎస్పీ గౌష్​ ఆలం ప్రమాద విషయం తెలియగానే హుటాహుటిన ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated : May 2, 2023, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.