ETV Bharat / bharat

నాలుగేళ్ల చిన్నారిని ఇటుకతో కొట్టి చంపిన 11 ఏళ్ల బాలుడు! - ఇటుకతో కొట్టి హత్య

Murder in korba: ఆటల్లో తనను హేళన చేస్తున్నాడనే కోపంతో నాలుగేళ్ల చిన్నారిని ఇటుక రాయితో కొట్టి చంపాడు ఓ 11 ఏళ్ల బాలుడు. మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేసి.. ఇంటికెళ్లి రక్తపు మరకలను శుభ్రం చేసుకున్నాడు. ఏమీ ఎరగనట్లు వ్యవహరించాడు. అయితే.. స్నిఫ్ఫర్​ డాగ్స్​ పట్టేశాయి. ఈ సంఘటన ఛత్తీస్​గఢ్​ కోర్బా జిల్లాలో జరిగింది.

Murder in korba
నాలుగేళ్ల చిన్నారిని ఇటుకతో కొట్టి చంపిన 11 ఏళ్ల బాలుడు
author img

By

Published : Apr 22, 2022, 7:40 PM IST

Murder in korba: ఛత్తీస్​గఢ్​ కోర్బా జిల్లాలో హృదయవిదారక సంఘటన వెలుగు చూసింది. నాలుగేళ్ల పిల్లాడి తలపై ఇటుకతో కొట్టి హత్య చేశాడు ఓ 11 ఏళ్ల బాలుడు. అనంతరం ఇంటికెళ్లి రక్తపు మరకలతో ఉన్న బట్టలను శుభ్రం చేసుకుని ఏమీ ఎరగనట్లు వ్యవహరించాడు. అయితే.. డాగ్​ స్క్వాడ్​, ఫోరెన్సిక్​ బృందాలు ఈ కేసును గంటల్లోనే ఛేదించాయి.

ఇదీ జరిగింది: జిల్లాలోని మానిక్​పుర్​ చౌక్​ ప్రాంతంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో రక్తపు మడుగులో పడి ఉన్న ఓ నాలుగేళ్ల బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతుడ్ని ముఢాపార్​కు చెందిన అన్షు సారథిగా గుర్తించారు. చిన్నారి మృతదేహం లభ్యమైన క్రమంలో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు డాగ్​ స్క్వాడ్​, ఫోరెన్సిక్​ బృందాలను పిలిపించి ఆధారాలు సేకరించారు. స్నిఫ్ఫర్​ డాగ్​​ 'బాఘా' మృతుడి బట్టలను వాసన చూసి నేరుగా ఓ ఇంట్లోకి పరుగెట్టింది. ఇంట్లో కనిపించిన 11 ఏళ్ల బాలుడిని చూసి అరవటం ప్రారంభించింది. వెంటనే ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

వారి విచారణలో హత్యకు సంబంధించిన విషయాలు వెల్లడించాడు నిందితుడు. అన్షు, నిందితుడు ఇరుగుపొరుగు వారే. ఆటలు ఆడే సమయంలో తనను అవహేళన చేసేవాడని, కోపంతో ఇటుకతో కొట్టినట్లు ఒప్పుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో మృతి చెందగా మృదేహాన్ని వాళ్ల సమీపంలోని ముళ్లపొదల్లో పడేసి ఇంటికెళ్లిపోయినట్లు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడు.

ఇదీ చూడండి: బైక్​పై ప్రేమజంట హల్​చల్.. నడిరోడ్డుపై రొమాన్స్ చేస్తూ..

కాంగ్రెస్​ పాలిత రాష్ట్రంలో 'బుల్​డోజర్'​ ట్రెండ్​.. 300ఏళ్ల నాటి గుడి కూల్చివేత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.