ETV Bharat / bharat

ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం.. మరిది కుమార్తె ఒంటిపై కిరోసిన్​ పోసి..

ఓ మహిళ తనతో సహా ముగ్గురు పిల్లలకు నిప్పంటించుకున్న ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది. మరోవైపు, ఆస్తి వివాదాల వల్ల మరిది కుమార్తె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది ఓ మహిళ. ఈ అమానవీయ ఘటన బిహార్​లో జరిగింది.

mother set child on fire
పిల్లలకు నిప్పంటించిన తల్లి
author img

By

Published : Nov 28, 2022, 12:36 PM IST

Updated : Nov 28, 2022, 1:14 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ కుషీనగర్​లో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలతో సహా ఓ మహిళ తనకు నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు గ్రామస్థులు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పిప్రా రజబ్ గ్రామానికి చెందిన ఛోటే లాల్ యాదవ్​కు ఇద్దరు భార్యలు. అతడి భార్య మంజుకు.. పూజ (19), ప్రియ (18) అనే కుమార్తెలు, ప్రవేశ్ (14) అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఆస్తి విషయంలో భార్యాభర్తలిద్దరు ఎక్కువగా గొడవపడేవారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ముంజు తనతో సహా ముగ్గురు పిల్లలపై నూనె పోసి నిప్పంటించుకుంది. వీరి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను అదుపుచేసి.. ఆస్పత్రికి తరలించారు. ప్రియ, పూజ, ప్రవేశ్ తీవ్రంగా కాలిపోగా.. మంజు స్వల్పంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థులతో పాటు అందరినీ సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గోరఖ్​పుర్​కు తరలించారు.

కుమార్తెపై పెద్దమ్మ దారుణం..
మైనర్​పై ఆమె పెద్దమ్మ దారుణానికి పాల్పడింది. వంట గదిలో ఉన్న కుమార్తె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. వెంటనే బాధితురాలిని సమస్తీపుర్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ దాడికి భూవివాదమే కారణమని పేర్కొన్నారు. బిహార్​లోని సమస్తీపుర్​లో ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది..
ఉదయపుర్ గ్రామానికి చెందిన సింగేశ్వర్ రామ్‌కు అతడి అన్నతో భూవివాదం చాలా కాలంగా ఉంది. పలుమార్లు పంచాయితీ కూడా జరిగింది. ఈ క్రమంలో సింగేశ్వర్​ రామ్​ కుటుంబంపై అతడి అన్న భార్య కోపం పెంచుకుంది. సింగేశ్వర్ రామ్ తన భార్యతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో.. వారి 14 ఏళ్ల కుమార్తెపై కిరోసిన్ పోసి నిప్పంటించింది.

Last Updated : Nov 28, 2022, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.