ETV Bharat / bharat

'వైవాహిక అత్యాచారం నేరం' కేసులో కేంద్రానికి సుప్రీం నోటీసులు - సుప్రీం కోర్టు లేటెస్ట్ న్యూస్

Marital Rape Supreme Court : వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం స్పందనను కోరింది సర్వోన్నత న్యాయస్థానం. ఫిబ్రవరి 15లోగా అభిప్రాయం చెప్పాలని సూచించింది.

Marital Rape Supreme Court
Marital Rape Supreme Court
author img

By

Published : Jan 16, 2023, 1:44 PM IST

Marital Rape Supreme Court : వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఫిబ్రవరి 15లోగా దీనిపై స్పందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. చీఫ్​ జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్ పీఎస్​ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 21న తదుపరి విచారణ ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

దిల్లీకి చెందిన ఖుష్బూ సైఫీ అనే మహిళ ఒక పిటిషన్​ దాఖలు చేయగా.. కర్ణాటకు చెందిన మరో వ్యక్తి సుప్రీంను ఆశ్రయించాడు. దిల్లీకి చెందిన మహళ అంతకుముందు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన న్యాయస్థానం 2022 మే 11న వేర్వేరు తీర్పులను వెలువరించింది. జస్టిస్​ రాజీవ్​ శక్ధేర్​, జస్టిస్​ సి.హరిశంకర్​తో కూడిన ధర్మాసనం.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించింది.

ఐపీసీలోని సెక్షన్​ 375 ప్రకారం.. మైనర్ కాని భార్యతో భర్త లైంగిక సంభోగం జరపడం నేరం కాదు. అయితే.. ఈ సెక్షన్​ రాజ్యాంగబద్ధతను కొందరు సవాలు చేశారు. లైంగికంగా వేధించే భర్తతో కాపురం చేసే మహిళ హక్కుల్ని హరించేలా ఈ సెక్షన్ ఉందని వాదిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. భార్య సమ్మతి లేకుండా లైంగిక సంభోగం చేసే భర్తను నేరస్థుడిగా పరిగణించవచ్చని డివిజన్ బెంచ్​కు నేతృత్వం వహించిన జస్టిస్ రాజీవ్​ శక్ధేర్ తీర్పు రాశారు. సెక్షన్ 375, 376(E) మినహాయిస్తే.. వైవాహిక అత్యాచారం రాజ్యాంగంలోని ఆర్టికల్​ 14,15,19(1)(A), 21లను ఉల్లంఘించే అంశం అని పేర్కొన్నారు.

అయితే.. అదే ధర్మాసనంలో మరో సభ్యుడైన జస్టిస్ హరిశంకర్.. ఇందుకు భిన్నంగా తీర్పు ఇచ్చారు. ఐపీసీలోని సెక్షన్​ 375 రాజ్యాంగవిరుద్ధం కాదని.. ఆర్టికల్​ 14, 19(1) (A), 21లను ఉల్లంఘించినట్లు కాదని వ్యాఖ్యానించారు. అంతకుముందు జనవరిలో జరిగిన విచారణలో "వివాహితలు, అవివాహితల గౌరవాన్ని వేర్వేరుగా చూడలేము. పెళ్లయినా.. కాకున్నా.. ఇష్టం లేని లైంగిక చర్యను నిరాకరించే హక్కు ప్రతి మహిళకు ఉంటుంది" అని జస్టిస్​ రాజీవ్​ శక్ధేర్​, జస్టిస్​ హరిశంకర్​తో కూడిన ధర్మాసనం పేర్కొంది. మరోవైపు కర్ణాటక కేసులో భార్యపై అత్యాచారం చేసిన భర్తను మినహాయించడం ఆర్టికల్​ 14కు విరుద్ధమని గతేడాది మార్చిలో ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: 'కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలి'.. సీజేఐకి రిజుజు లేఖ

వైభవంగా పెంపుడు శునకాల వివాహం.. ఏడడుగులతో ఒక్కటైన జంట.. ఘనంగా ఊరేగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.