ETV Bharat / bharat

మద్యం స్కామ్​ కేసులో మనీశ్​ సిసోదియాకు 5 రోజుల సీబీఐ కస్టడీ

author img

By

Published : Feb 27, 2023, 5:28 PM IST

Updated : Feb 27, 2023, 9:39 PM IST

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియాకు 5 రోజుల సీబీఐ కస్టడీని విధించింది రౌస్​ అవెన్యూ డిస్ట్రిక్ట్​ కోర్టు. సిసోదియా మార్చి 4 వరకు సీబీఐ అదుపులో ఉండనున్నారు.

Manish Sisodia Liquor Scam Case
మనీశ్​ సిసోదియా లిక్కర్​ స్కామ్​ కేసు

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియాకు 5 రోజుల సీబీఐ రిమాండ్​ను విధించింది దిల్లీలోని రౌస్​ అవెన్యూ జిల్లా న్యాయస్థానం. ఆదివారం సిసోదియాను అరెస్టు చేసిన సీబీఐ.. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సోమవారం న్యాయస్థానంలో సిసోదియాను హాజరుపరిచింది. సానుకూలంగా స్పందించిన కోర్టు మార్చి 4 వరకు రిమాండ్​కు అనుమతినిచ్చింది.

అంతకుముందు కోర్టులో వాదనలు వినిపించిన మనీశ్​ తరఫు న్యాయవాది.. ఈ కేసులో మంత్రి పాత్ర ఏమి లేదని తెలిపారు. మరోవైపు.. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నారని సీబీఐ తరఫు లాయర్​ న్యాయమూర్తికి నివేదించారు. అయితే ఈ కేసులో లోతైన దర్యాప్తు కోసం మనీశ్​ సిసోదియా నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు తమకు 5 రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయవాది కోర్టును కోరారు.

రిమాండ్​కు సంబంధించి సీబీఐ చేసిన విజ్ఞప్తిని వ్యతిరేకించారు మనీశ్​ లాయర్. మంత్రి ఫోన్​ మార్చారని అధికారులు చెబుతున్నారని.. అయితే మొబైల్​ మార్చడం నేరం కాదని ఆయన న్యాయమూర్తికి చెప్పారు. ఈ వ్యవహారంలో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి కూడా సలహాలు తీసుకున్న తర్వాతే నూతన మద్యం విధానాన్ని అమలు చేశామని.. ఇందులో ఎటువంటి కుట్ర జరిగే అవకాశమే ఉండదని ఆయన కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. సీబీఐ కస్టడీకి సిసోదియాను అప్పగించింది.

విజయ్ నాయర్, సిసోదియా చాలా క్లోజ్!
మనీశ్‌ సిసోదియా రిమాండ్‌ రిపోర్టులో పలు కీలక అంశాలు వెల్లడించింది సీబీఐ. సిసోదియాకు విజయ్ నాయర్‌ అత్యంత సన్నిహితుడు అని పేర్కొంది. అభ్యంతరాలన్నీ పక్కన పెట్టి ఇండో స్పిరిట్‌కు వ్యాపారం దక్కేలా చేశారని తెలిపింది. 'మద్యం పాలసీలో తాము చెప్పినట్లు చేయాలని కమిషనర్‌ను సిసోదియా ఆదేశించారు. నిపుణుల కమిటీ సిఫార్సుకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. నిందితులతో కలిసి విజయ్‌నాయర్ మొత్తం వ్యవహారం నడిపారు. నిందితులు తరచూ దిల్లీ, హోటళ్లలో సమావేశమయ్యారు. మంత్రుల ముసాయిదా కమిటీ నివేదిక నిందితులకు చేరింది. నిందితుల వాట్సాప్ చాట్స్‌లో ఈ నివేదిక కనిపించింది. బస చేసిన ఒబెరాయ్ హోటల్లోనే ముసాయిదా నివేదిక ప్రింట్‌ తీశారు. నిందితులు చర్చించిన అంశాలు మంత్రుల కమిటీ తుది నివేదికలో ఉన్నాయి' అని సీబీఐ వెల్లడించింది.

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియాను ఆదివారం కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టుకు ముందు ఆదివారం ఉదయం 11:12 నిమిషాలకు దిల్లీలోని సీబీఐ కార్యలయానికి హాజరైన మనీశ్​ను అధికారులు దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేసినట్లు సాయంత్రం ప్రకటించారు. ఈ వ్యవహారంలో కేరళకు చెందిన ఐఏఎస్​ అధికారి దినేశ్​ అరోరాతో సహా ఇతర నిందితులతో ఉన్న సంబంధాల పైనా సీబీఐ ఆరా తీసింది. వారితో జరిపిన సంభాషణల వివరాలనూ క్లుప్తంగా అడిగి తెలుసుకుంది. అయితే విచారణ సమయంలో మంత్రి​ సహకరించలేదంటూ సీబీఐ ఉన్నతాధికారులు వెల్లడించారు. చాలా ప్రశ్నలకు ఆయన స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని.. అందుకే ఆయన్ను అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు.

ఇదీ కేసు..
ఇటు రాష్ట్రంతో పాటు దేశ రాజధాని కుదిపేస్తుంది దిల్లీ లిక్కర్​ కుంభకోణం. ఈ వ్యవహారంలో అనేక మందిని ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసింది. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన 2021-22 నూతన మద్యం పాలసీ నూతన విధానంలో అనేక అవకతవకలు జరిగాయని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. నిబంధనల ఉల్లంఘన సహా విధానపరమైన లోపాలతో ఈ ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. కొందరికి లబ్ధి చేకూర్చేలా టెండర్ల విధానంలో మార్పులు చేశారని పేర్కొన్నారు. అబ్కారీ శాఖ ఇన్​ఛార్జ్​ మంత్రిగా ఉన్న మనీశ్​ సిసోదియా పేరునూ ఇందులో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా కేంద్ర దర్యాప్తు సంస్థకు గతంలో సిఫార్సు చేశారు. దీంతో పలువురు నేతలతో పాటు దిల్లీ ఉపముఖ్యమంత్రిపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తానికి ఈ ఎక్సైజ్​ నూతన పాలసీ విధానాన్ని రద్దు చేసింది ఆప్​ సర్కార్​.

Last Updated : Feb 27, 2023, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.