Lokesh with Prison department DIG Ravi Kiran చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌తో నారా లోకేష్ మాట్లాడారు. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత అక్కడే ఉన్న డీఐజీని లోకేష్ కలిశారు. ప్రభుత్వ వైద్యుల నివేదిక చూపించి చంద్రబాబు అనారోగ్యంపై డీఐజీ రవికిరణ్‌ను ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని నివేదికలో ఉందన్న లోకేష్.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఎందుకు ఇస్తున్నారని అడిగారు. చంద్రబాబుకు సౌకర్యాలపై వైద్యుల సూచన ఎందుకు అమలు చేయట్లేదని లోకేష్ తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. మాజీ సీఎం విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. డీహైడ్రేషన్‌కు గురైన చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలన్న వైద్యుల సూచనలను ఎందుకు పెట్టించుకోలేదని ప్రశ్నించారు. వైద్యుల సూచనలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులకు లేదా అని లోకేష్ ప్రశ్నించారు. వైద్య బృందం ఇచ్చిన నివేదికలు తొక్కిపెట్టారని డీఐజీ వద్ద నారా లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నారా లోకేష్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వని డీఐజీ రవికిరణ్.. ములాఖత్ సమయం ముగిసిందని, వెళ్లిపోవాలని లోకేష్‌కు సూచించినట్లు తెలిసింది.
Lokesh Questioned DIG Ravi Kiran on CBN Health జైళ్లశాఖ డీఐజీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన లోకేశ్.. ప్రభుత్వ వైద్యుల నివేదికను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్న!
Published : Oct 14, 2023, 5:10 PM IST
|Updated : Oct 15, 2023, 6:14 AM IST
17:07 October 14
ములాఖత్ ద్వారా చంద్రబాబును కలిసిన లోకేశ్.. ఆ తర్వాత అక్కడే ఉన్న డీఐజీని కలిశారు.