ETV Bharat / bharat

కేదార్​నాథ్​ ఆలయంలోకి పెంపుడు కుక్క.. వీడియో వైరల్​.. యజమానిపై కేసు! - కుక్క వీడియో వైరల్​

Kedarnarh Temple Dog: ఉత్తరాఖండ్​లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్​నాథ్​ ఆలయంలోకి ఓ వ్లాగర్​ పెంపుడు కుక్కను తీసుకెళ్లటం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారటం వల్ల చర్యలు చేపట్టింది బద్రీనాథ్​- కేదార్​నాథ్​ ఆలయ కమిటీ. శునకం యజమానిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

pet dog into Kedarnath shrine
కేదార్​నాథ్​ ఆలయంలోకి పెంపుడు శునకం
author img

By

Published : May 21, 2022, 5:36 PM IST

Updated : May 21, 2022, 7:24 PM IST

కేదార్​నాథ్​ ఆలయంలోకి పెంపుడు శునకం

Kedarnarh Temple Dog: కేదార్​నాథ్​ ఆలయంలోకి పెంపుడు శునకాన్ని తీసుకెళ్లిన దృశ్యాలు వైరల్​గా మారిన క్రమంలో చర్యలు చేపట్టింది ఆలయ కమిటీ. కుక్కను తీసుకెళ్లిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలన్న బద్రీనాథ్​- కేదార్​నాథ్​ ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు నోయిడాకు చెందిన సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్​ వికాశ్​ త్యాగీపై కేసు నమోదు చేశారు పోలీసులు.

" బద్రీనాథ్​-కేదార్​నాథ్​ ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాం. పెంపుడు శునకంతో పాటు కేదార్​నాథ్​కు వచ్చిన వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అతడిని గుర్తించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. "

- ఆయూష్​ అగర్వాల్​, రుద్రప్రయాగ్​ ఎస్పీ.

నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోలో వికాశ్​ త్యాగీ.. సైబీరియన్​ హస్కీ రకానికి చెందిన తన పెంపుడు శునకాన్ని కేదార్​నాథ్​ ఆలయం వద్దకు తీసుకెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆలయం ముందు ఉన్న 'నంది' విగ్రహానికి శునకం కాళ్లను ఆనించడం, దానికి బొట్టు పెట్టించటం, కుక్కను ఎత్తుకుని గుడ్రంగా తిరగటం వంటివి చేస్తూ కనిపించాడు. ఈ సంఘటన వారం రోజుల క్రితం జరగ్గా.. భక్తులు, నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. మరోవైపు.. ఈ విషయంపై ఆలయ కమిటీ సీఈఓకు అధ్యక్షుడు అజేంద్ర కీలక సూచనలు చేసినట్లు మీడియా సెల్​ తెలిపింది. ఇలాంటి ఘటనలను ముందుగానే గుర్తించి.. అడ్డుకోవాలని, శునకాన్ని తీసుకొచ్చిన అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొంది.

pet dog into Kedarnath shrine
కేదార్​నాథ్​ ఆలయంలోకి పెంపుడు శునకం

ఇదీ చూడండి: వేల అడుగులు ఎత్తయిన కొండపై ట్రాక్టర్​ స్టంట్స్​.. వీడియో వైరల్​

తెరుచుకున్న బద్రీనాథ్​ ఆలయం.. భారీగా హాజరైన జనం

Last Updated : May 21, 2022, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.