ముంబయి సెంట్రల్లో ప్రయాణికుల కోసం అధునాతన 'పాడ్ హోటల్'ను నిర్మిస్తోంది భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ). స్టేషన్ మొదటి అంతస్తులోని రెండు నాన్ ఏసీ గదులను జపాన్ తరహా క్యాప్సుల్ హోటల్‌గా మారుస్తోంది. అందులో ప్రయాణికులకు రాత్రివేళ బస కల్పించడానికి మొత్తం 30 గదులుంటాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరుకు వాటి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు.
ఎంతో చౌకగా.. దీపావళి కానుకగా
ప్రైవేటు హోటళ్ల కన్నా చౌకగా, తగిన వసతులతో రాత్రి వేళ పూర్తి భద్రత కల్పించే విధంగా వీటిని రూపొందిస్తున్నట్లు ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. "ఈ గదులను 12 గంటల పాటు అద్దెకు ఇస్తాం. మొత్తం రూ.1.80కోట్ల వ్యయంతో అధునాతన డిజైన్లతో నిర్మాణం జరిగింది. దీపావళికి వరకల్లా వీటిని అందుబాటులోకి తీసుకొస్తాం." అని వెల్లడించారు.
వాస్తవానికి 2020లోనే ఈ పాడ్ హోటల్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆ పనులకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చూడండి: 50 ఏళ్ల తర్వాత ఆ మార్గంలో తొలి రైలు!