ETV Bharat / bharat

Hyderabad-Dubai Flight Hijack Threat : 'హైదరాబాద్‌-దుబాయ్‌ విమానం హైజాక్​..!' - Hyderabad Dubai Flight Hijack Threat

Threat Mail for shamshabad airport
Threat Mail for Hyderabad-Dubai Flight
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 10:07 AM IST

Updated : Oct 9, 2023, 10:49 AM IST

09:55 October 09

Threat Mail for Hyderabad-Dubai Flight : 'హైదరాబాద్‌-దుబాయ్‌ విమానాన్ని హైజాక్​ చేయబోతున్నాం..'

Hyderabad-Dubai Flight Hijack Threat : శంషాబాద్​ విమానాశ్రయానికి ఓ బెదిరింపు మెయిల్‌ వచ్చింది. హైదరాబాద్‌-దుబాయ్‌ విమానాన్ని హైజాక్‌ చేయబోతున్నట్లు దుండగులు ఆ మెయిల్​లో పేర్కొన్నారు. దీంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. కాసేపట్లో రన్​ వే పైనుంచి బయలుదేరుతుందనగా ఆ విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికులు అందరి లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాత వినోద్‌, తిరుపతి, రాకేశ్‌ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు దుబాయ్‌ మీదుగా ఇరాక్‌ వెళ్తున్నట్లు గుర్తించిన అధికారులు.. వారిని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అనంతరం హైదరాబాద్​-దుబాయ్ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. అందులో ఉన్న ప్రయాణికులను మరో విమానంలో దుబాయ్‌ పంపించారు.

Bomb Threat to Hyderabad Airport : హైదరాబాద్​ ఎయిర్​పోర్టుకు బాంబు బెదిరింపు.. 'నా కుమారుడు పంపించాడంటూ..'

40 రోజుల వ్యవధిలో రెండో బెదిరింపు..: శంషాబాద్​ విమానాశ్రయానికి ఇలాంటి బెదిరింపు మెయిల్​ రావడం గత 40 రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఆగస్టు 29న సైతం ఓ ఆగంతకుడి నుంచి ఎయిర్​పోర్ట్​కు మెయిల్​ వచ్చింది. విమానాశ్రయంలో బాంబు ఉందంటూ ఆ మెయిల్​లో పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో సీఐఎస్​ఎఫ్​ బృందం రంగంలోకి దిగారు. బాంబు డిస్పోజల్ స్వ్కాడ్, డాగ్​ స్వ్కాడ్​ల సాయంతో ఎయిర్​పోర్ట్​ మొత్తం జల్లెడ పట్టారు. దాదాపు గంటసేపు వెతికినా బాంబు జాడ కనిపించకపోవడంతో ఫేక్​ కాల్​గా నిర్ధారణకు వచ్చారు. అనంతరం విమానాశ్రయం ఆపరేషన్స్‌ కంట్రోల్‌ కేంద్రానికి వచ్చిన మెయిల్​ ఐడీ వివరాలతో స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

భారీ ఉగ్ర కుట్ర.. బెంగళూరులో పేలుళ్లకు ప్లాన్.. ఐదుగురు 'ముష్కరులు' అరెస్ట్

కేసు నమోదు చేసుకున్న ఆర్​జీఐ పోలీసులు.. ఆ మెయిల్​పై ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈలోపు మరో మెయిల్​ వచ్చిందంటూ ఎయిర్​పోర్ట్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొబైల్​లో ఆడుకుంటూ తన కుమారుడు తనకు తెలియకుండా ఆ మెయిల్​ చేశాడని సదరు వ్యక్తి రెండో మెయిల్​ పంపినట్లు పోలీసులకు తెలిపారు. తప్పు జరిగిందని.. క్షమించాలంటూ మెయిల్​లో కోరాడని వివరించారు. 'అయితే సదరు వ్యక్తి తప్పు జరిగిందని చెప్పాడు కానీ.. మెయిల్ ఐడీ మాత్రం terrorist@gmail.com అని ఉంది. కుమారుడు ఫోన్​తో ఆడుతూ తెలియకుండా పంపిస్తే ఇలాంటి ఐడీ ఎందుకు పెట్టుకున్నారనే అనుమానం వచ్చింది. అతడికి మళ్లీ మెయిల్ చేస్తే స్పందన లేకపోవడంతో అతడి ఐటీ అడ్రస్ కనిపెట్టే పనిలో పడ్డాం. వీలైనంత తొందరగా ఆ ఫేక్ మెయిల్ పంపించిందెవరో పట్టుకుంటాం. అది నిజంగా ఫేక్ మెయిలేనా.. లేక ఇందులో ఇంకా ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నాం." అని పోలీసులు తెలిపారు.

Hyderabad Airport is Most Punctual : సమయపాలనలో నంబర్ వన్ 'శంషాబాద్ ఎయిర్​పోర్టు'

ఎయిర్​పోర్టులో బాంబు ఉందంటూ బెదిరింపు రావడం.. అధికారులు.. డాగ్, బాంబు స్క్వాడ్​.. పరుగులు పెడుతూ వెతకడం చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థంగాక ఆందోళన చెందారు. బాంబు పెట్టారన్న సమాచారం విని భయాందోళనకు గురయ్యారు. అయితే చివరి నిమిషంలో బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

'సీమా హైదర్‌ పాకిస్థాన్​ ఏజెంట్‌?'.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడి

Last Updated : Oct 9, 2023, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.