ETV Bharat / bharat

How to Get Rid of Smell in Bathroom : ఈ టిప్స్ పాటించండి.. మీ బాత్రూమ్ దుర్వాసనొస్తే అడగండి..! - బాత్రూమ్ క్లీనింగ్ కోసం 7 ఉత్తమ చిట్కాలు

How to Get Rid of Smell in Bathroom : బాత్​రూమ్​ను ఎన్నిసార్లు కడిగినప్పటికీ.. దుర్వాసన వదలట్లేదని తెగ బాధపడుతుంటారు చాలా మంది. అయితే.. దానికి ప్రధాన కారణం ఏమంటే.. సరైన పద్ధతిలో శుభ్రం చేయకపోవడమే అంటున్నారు నిపుణులు. అందుకే.. సూపర్ టిప్స్ సూచిస్తున్నారు. మరి, అవేంటో చూద్దామా..??

Bathroom Cleaning
How to Get Rid of Smell in Bathroom
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 8:54 AM IST

Updated : Oct 18, 2023, 9:23 AM IST

7 Easy Hacks for Get Rid of Bad Smell in Bathroom : ఇంటిని శుభ్రం చేయడంలో మహిళలది అందెవేసిన చేయి.! ఇల్లు తళతళా మెరిసిపోవాలనే ఉద్దేశంతో ఆడవారు ఓపిక ఉన్నా లేకపోయినా వీలు చూసుకొని మరీ క్లీనింగ్ పని పెట్టుకుంటారు. అయితే ఇంటిని శుభ్రం(House Cleaning) చేయడం ఒక ఎత్తయితే బాత్రూమ్​ని క్లీన్ చేయడం ఒక ఎత్తు. చాలా మంది బాత్రూమ్​ను అప్పుడప్పుడూ కడుగుతూ ఉన్నప్పటికీ ఎప్పడూ తేమగా ఉండటం వల్ల దుర్వాసన వస్తుంటుంది.

How to Get Rid of Bad Smell in Bathroom : ఇక మరికొందరైతే బాత్రూమ్​ను ఎవరు చూస్తారులే అని ఎదో అలా కడిగి కడిగనట్లు క్లీన్ చేస్తుంటారు. కానీ, బాత్రూమ్ శుభ్రంగా(Bathroom Cleaning) లేకపోతే వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయి. అది క్లీన్​గా లేకపోతే దాని నుంచి వచ్చే చెడు వాసన వల్ల పరిసరాల్లో వాతావరణం ఆహ్లాదభరితంగా ఉండకుండా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండలాంటే మేం చెప్పే ఈ స్టోరీలో చెప్పే కొన్ని టిప్స్ పాటిస్తే మీ బాత్రూమ్ ఎప్పుడూ ఫ్రెష్​గా ఉండడమే కాకుండా సువాసనలు వెదజల్లుతుంది. మరి, ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Best 7 Tips for Bathroom Cleaning in Telugu :

క్రమం తప్పకుండా శుభ్రం చేయండి : మీ బాత్రూమ్‌ను ఎప్పుడూ దుర్వాసను వెదజల్లకుండా ఉండడానికి సులభమైన మార్గం రెగ్యులర్ క్లీనింగ్. బాత్రూమ్ ఫ్లోర్, వాష్ బేసిన్, సింక్, షవర్, బాత్‌టబ్, టాయిలెట్​లలో ఎప్పుడూ తడి తగులుతూ ఉండటం వల్ల అక్కడ బ్యాక్టీరియా ఎక్కువగా చేరిపోయ దుర్వాసనను కలిగిస్తుంటాయి. అందుకే మీరు క్రమం తప్పకుండా ఈ గదిని శుభ్రపరచడం ద్వారా చెడు వాసనలకు కారణమయ్యే ధూళి, ధూళి తొలగిపోయి వాసన రాకుండా ఉంటుంది.

వెంటిలేషన్ వచ్చేలా చూసుకోండి : బాత్రూమ్ గదికి గాలీ, వెలుతురూ ధారాళంగా ఉంటడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఉపయోగించని సమయంలో కిటికీలు, తలుపులు తెరిచిపెట్టడం వల్ల అక్కడ ఉన్న తేమ తొందరగా ఆరపోతుంది. ఒకవేళ కిటికీ సౌలభ్యం లేకపోతే ఎగ్జాస్ట్ ఫ్యాన్​ని పెట్టుకోవడం ఉత్తమం. ఎప్పుడైనా దుర్వాసన వస్తుందనుకున్నప్పుడు దీనిని ఆన్ చేయడం వల్ల ఫలితం ఉంటుంది.

ఎయిర్ ఫ్రెషనర్లను ఉపయోగించండి : బాత్రూమ్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎయిర్ ఫ్రెషనర్‌లను ఉపయోగించడం ద్వారా దుర్వాసనను రాకుండా చూసుకోవచ్చు. మీరు ప్లగ్-ఇన్ ఎయిర్ ఫ్రెషనర్లు, ఏరోసోల్ స్ప్రేలు లేదా జెల్ ఆధారిత ఉత్పత్తుల వంటి వివిధ ఎంపికల నుంచి ఎంచుకోవచ్చు.

ఉదయం లేవగానే చేయాల్సిన మొదటి పనేంటో తెలుసా..?

నేచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్లను వాడండి : వాసనలను గ్రహించి, తటస్థీకరించడంలో ప్రభావవంతంగా ఉండే సహజ మూలకాలను ఉపయోగించండి. దుర్వాసన లేదా అవాంఛిత వాసనలను పీల్చుకోవడానికి బాత్‌రూమ్‌లో బేకింగ్ సోడా, యాక్టివేట్ చేసిన బొగ్గు లేదా వైట్ వెనిగర్ గిన్నె ఉంచండి. ఈ సహజ ఎయిర్ ప్యూరిఫైయర్లు ఖర్చుతో కూడుకున్నవైనా పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి.

సుగంధ నూనెలను ప్రయత్నించండి : ఇప్పుడు మార్కెట్లో బాత్రూమ్‌లు ఫ్రెష్​గా ఉండేందుకు బోలెడు ఫ్రెషనర్లు అందుబాటులో ఉన్నాయి. సిట్రస్, లావెండర్ లేదా యూకలిప్టస్ వంటి సుగంధ నూనెలు బాత్రూమ్‌కు ఆహ్లాదకరమైన సువాసనను జోడించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. మీరు ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్‌ని టాయిలెట్ పేపర్ రోల్‌లో కొన్ని చుక్కలను జోడించవచ్చు లేదా స్ప్రే బాటిల్‌లో నూనెలను నీటితో కలపడం ద్వారా DIY ఎయిర్ ఫ్రెషనర్‌ను తయారు చేయవచ్చు.

తడి బట్టల్ని అక్కడే వదిలేయకండి : చాలా మంది స్నానం చేసిన తర్వాత విడిచిన దుస్తుల్ని అక్కడే వదిలేస్తారు. అలాగే తుడుచుకున్న తడి తువాలునూ హ్యాంగర్ మీదనే ఉంచేస్తారు. ఇలా సగం తడిచిన దుస్తులు అక్కడ ఉంటే కచ్చితంగా దుర్వాసన వస్తుంది. అందుకనే ఈ పరిసరాల్లో దుస్తులు, తువాళ్లు లేకుండా ఎప్పటికప్పుడు తీసివేయండి.

డ్రైన్‌ సరిగ్గా ఉందో లేదో చూడండి : ఎప్పటికప్పుడు బాత్రూమ్‌ డ్రైన్‌ ఎలాంటి అడ్డంకులూ లేకుండా సజావుగా నీరు వెళ్లడానికి వీలుగా ఉందో లేదో సరి చూసుకోండి. ఎందుకంటే డ్రైన్‌ దగ్గర జుట్టు, మట్టి ఎక్కువగా చేరిపోతుంటాయి. అవి నీటిని వెళ్లనివ్వకుండా చేయడమే కాకుండా దుర్వాసనను కలిగిస్తాయి. కాబట్టి నీరు వెళ్లే డ్రైన్‌ దగ్గర జాలీని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. అలాగే బాత్రూమ్​ ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోండి. తడిగా ఉంటే తేమ పేరుకుని సూక్ష్మజీవులు పేరుకుపోతాయి. దాంతో చెడువాసన వస్తుంది.

అద్భుతమైన చిట్కాలను చూశారు కదా. ఇంకెందుకు ఆలస్యం వీటిని రెగ్యులర్ గా అనుసరించి మీ బాత్రూమ్ ని ఎప్పుడూ ఫ్రెష్​గా ఉంచుకోండి.

Cleaning Tips : ఇల్లే కాదు.. వీటినీ వారానికోసారి శుభ్రం చేయాల్సిందే..!

వామ్మో.. చేతులు శుభ్రం చేసుకోకపోతే ఇన్ని అనర్థాలా?

home services apps: ఒక్క క్లిక్ కొడితే చాలు.. మీ ఇంటికొచ్చి అన్నీ చక్కబెట్టేస్తారు

Last Updated : Oct 18, 2023, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.