Wife Killed Husband: ఓ మహిళ తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోగానే అతడిని చికెన్ బర్నర్పైన కాల్చి చంపింది. ఎనిమిది నెలల క్రితం కర్ణాటకలోని చిక్కబళ్లాపుర గంజిగుంటె గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులను మెహర్, తౌసిఫ్లుగా గుర్తించారు.
ఇదీ జరిగింది..: మెహర్ గత కొంతకాలంగా తౌసిఫ్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే భర్త దాదాపయర్ తనకు అడ్డుగా ఉన్నాడని భావించిన మెహర్.. ఓ రోజు అతడికి నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోగానే ప్రియుడి సాయంతో హత్య చేసింది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ కథ అల్లింది. అయితే ఈ విషయంపై అనుమానం వచ్చిన దాదాపయర్ సోదరి రేష్మా తాజ్.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. ప్రధాన నిందితురాలు మెహర్ సహా ఆమె ప్రియుడు తౌసిఫ్లను అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి : గన్తో ఆడుతూ ట్రిగ్గర్ నొక్కిన బాలుడు.. రెండేళ్ల చిన్నారి మృతి