ETV Bharat / bharat

రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం - farm bills 2020

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు 6వ రోజుకు చేరాయి. దిల్లీలో తీవ్రమైన చలి, కరోనా విస్తృతి దృష్ట్యా ముందుగా అనుకున్నట్లు డిసెంబర్​ 3న కాకుండా మంగళవారమే చర్చలకు రావాలని రైతు సంఘాలను కేంద్రం ఆహ్వానించింది. విజ్ఞాన్ భవన్​లో మధ్యాహ్నం 3గంటలకు భేటీకి ఆహ్వానించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అయితే షరతులతో కూడిన కేంద్రం చర్చలను రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

govt-invites-kisan-union-for-talks-on-dec-1-at-vigyan-bhawan
చర్చలకు రమ్మంటున్న కేంద్రం- షరతులు వద్దంటున్న రైతులు
author img

By

Published : Dec 1, 2020, 5:33 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన 'ఛలో దిల్లీ' ఆందోళన ఉద్ధృతంగా కొనసాగుతోంది. పంజాబ్‌తో పాటు పలు రాష్ట్రాల నుంచి దిల్లీకి చేరుకున్నారు రైతులు. సింఘు, టిక్రీ, ఘాజిపుర్ సరిహద్దుల వద్ద ఎముకలు కొరికే చలిలోనూ పోరాటం సాగిస్తున్నారు. చలిని లెక్కచేయకుండా ట్రాక్టర్‌ ట్రాలీలపై టార్పిన్లు కప్పి వాటినే గుడారాలుగా మార్చుకున్నారు. ఎండుగడ్డి, వరిదబ్బులనే పరుపులుగా చేసుకున్నారు. సోమవారం సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్ జయంతి సందర్భంగా ఆర్దాస్‌ ప్రార్థనలను కూడా అక్కడే నిర్వహించారు. ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఘజీ పూర్‌ వద్ద రైతుల సంఖ్య క్రమేణ పెరుగుతోంది. వారు దిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు పెద్దపెద్ద కాంక్రిట్ దిమ్మెలను అడ్డంగా పెట్టారు. బురాడీలోని నిరంకారీ మైదానానికి ఇంతకుముందే చేరుకున్న కొంతమంది రైతులు అక్కడ ధర్నా కొనసాగిస్తున్నారు.

'ఇవాళే చర్చకు రండి'

దిల్లీలో తీవ్రమైన చలి, కరోనా విస్తృతి దృష్ట్యా డిసెంబర్‌ 3కు బదులు మంగళవారమే చర్చలకు రావాల్సిందిగా రైతులను ఆహ్వానించినట్లుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో రైతు నాయకులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నవంబర్‌ 13న జరిగిన మొదటి రౌండ్ చర్చలకు వచ్చిన రైతు నాయకులనే ఈ దఫా కూడా ఆహ్వనించినట్లు పేర్కొన్నారు.

మరోవైపు షరతులతో కూడిన కేంద్రం చర్చలను వ్యతిరేకిస్తున్నాయి రైతు సంఘాలు. తమ డిమాండ్లకు అంగీకరించకుంటే ఆందోళనను మరింత తీవ్రతరం చేయనున్నట్లు హెచ్చరించాయి. రాజధానిలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలిపేందుకు తమకు అవకాశం ఇవ్వాలని రైతులు పట్టుపడుతున్నారు. కరోనా, చలితీవ్రత కన్నా నూతన చట్టాలే తమను అధికంగా నష్టపరుస్తాయని తేల్చి చెబుతున్నారు.

ప్రజాసంఘాల మద్దతు

రైతుల ఆందోళనలకు ప్రజాసంఘాల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రతిఒక్కరు రైతులకు మద్దతు పలకాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు స్పీకప్‌ ఫర్ ఫార్మర్స్‌ పేరిట ఓ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సామాజిక మాధ్యమాల్లో ప్రారంభించారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే రైతు చట్టాలను ఎలా చేస్తారని ట్విట్టర్‌ వేదికగా కేంద్రంపై మండిపడ్డారు. దేశంలోని 62 కోట్ల మంది రైతులకు కనీస మద్దతు ధర లేకుండా చేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. ఈ చట్టాలన్ని పెట్టబడిదారులను సంతృప్తి పరచడానికే చేశారని ఆరోపించారు. రైతులు గొంతెత్తితే అది దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందన్న విషయాన్ని కేంద్రం మర్చిపోయిందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొందరు బిలియనీర్లకు మాత్రమే ఈ చట్టాలు లాభం చేకూరుస్తాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. రైతులకు ఐదు వామపక్షాలైన సీపీఐ, సీపీఎం, ఆర్​ఎస్​పీ, సీపీఐ(ఎంఎల్​), ఏఐఎఫ్​బీ మద్దతు తెలిపాయి. ఆయా పార్టీల నాయకులు ఆందోళన స్థలానికి వెళ్లి రైతులకు సంఘీభావం తెలిపారు.

ఇదీ చూడండి: రైతుల నిరసన వేళ ఎన్​డీఏకు మరో షాక్!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.