ETV Bharat / bharat

రిక్షావాలా టు క్యాబ్ కంపెనీ ఓనర్​- ఇంటర్​ చదివి ఐఐటీయన్లకు ఉద్యోగాలు- ఈయన సక్సెస్​ స్టోరీ అదుర్స్​

Dilkhush Kumar Rodbez : ఇంటర్​ మాత్రమే చదివిన ఓ యువకుడు.. ఐఐటీ, ఐఐఎమ్​ లాంటి దిగ్గజ సంస్థల విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. రిక్షా తొక్కే స్థాయి నుంచి అనేక మందికి జీవనోపాధి కల్పించే స్థితికి ఎదిగాడు. యువ పారిశ్రామికవేత్తగా మారి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు బిహార్​కు చెందిన 30 ఏళ్ల దిల్​ఖుశ్ ​కుమార్​.

Dilkhush Kumar Rodbez
Dilkhush Kumar Rodbez
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 4:39 PM IST

రిక్షావాలా టు క్యాబ్ కంపెనీ ఓనర్​- ఇంటర్​ చదివి ఐఐటీయన్లకు ఉద్యోగాలు

Dilkhush Kumar Rodbez : దిల్లీ గల్లీల్లో రిక్షా నడిపాడు.. వీధుల్లో తిరుగుతూ కూరగాయలు అమ్మాడు... కట్​ చేస్తే ఇప్పుడు రూ.10 కోట్లు విలువైన సంస్థకు అధిపతి. ఆడీ, హోండా లాంటి లగ్జరీ కార్లలో తిరుగుతున్నాడు. ఇంటర్ మాత్రమే చదవిన ఆ యువకుడు.. ఐఐటీ, ఐఐఎమ్​ లాంటి దిగ్గజ సంస్థల విద్యార్థులు సహా ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తున్నాడు. అతడే.. బిహార్​ సహర్సా జిల్లాలోని బంగావ్​ గ్రామానికి చెందిన దిల్​ఖుశ్​కుమార్​. మొబైల్ యాప్ ద్వారా క్యాబ్ సేవలు అందించే 'రోడ్​బెజ్​' అనే అంకుర సంస్థ వ్యవస్థాపకుడు.

Dilkhush Kumar Rodbez
రోడ్​బెజ్​ అధినేత దిల్​ఖుశ్​ కుమార్​

"ఇంటర్ తర్వాత దిల్లీకి వెళ్లాను. అక్కడికి వెళ్లిన కొత్తలో నాకు ఎవరూ పని ఇవ్వలేదు. డ్రైవర్​గా ప్రయత్నించగా.. నీకు ఇక్కడ రూట్​, ట్రాఫిక్​ నిబంధనలు తెలియవని చెప్పి ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో 15 రోజుల పాటు రిక్షా నడిపాను. ఆ తర్వాత నా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల తిరిగి ఇంటికి వచ్చేశాను. అప్పుడే సొంతంగా కంపెనీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. చిన్నచిన్న సంస్థలను మొదలుపెట్టి విఫలమయ్యాను. ఆ తర్వాత ఆర్యగో కంపెనీ స్థాపించి విజయవంతం అయ్యాను."

--దిల్​ఖుశ్​ కుమార్​, రోడ్​బెజ్​ సంస్థ యజమాని

2016లో 'ఆర్యగో' అనే సంస్థను ప్రారంభించాడు దిల్​ఖుష్​. అది విజయవంతమైన తర్వాత 2022 జులైలో 'రోడ్​బెజ్​' అనే మరో స్టార్టప్​ను మొదలుపెట్టాడు. పట్నా, సహర్సాతో పాటు పొరుగు జిల్లాలకూ వీటి సేవలను విస్తరించాడు. సుమారు రూ. 70 లక్షలతో 'రోడ్​బెజ్​'ను ప్రారంభించగా.. కేవలం 2 నెలల్లోనే రూ.4 కోట్లకు ఎదిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.10 కోట్లకు చేరింది. రుకాన్​పుర కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ద్వారా 19 మంది సిబ్బందితో పాటు అనేక మంది డ్రైవర్లు ఉపాధి పొందుతున్నారు. ఇప్పటివరకు 'రోడ్​బెజ్'​ యాప్​ను లక్ష మందికి పైగా యూజర్లు డౌన్​లోడ్ చేసుకున్నారు. ఇందులో 50 వేల డౌన్​లోడ్​లు గత 4 నెలల్లో జరిగినవే కావడం విశేషం.

Dilkhush Kumar Rodbez
రోడ్​బెజ్​ అధినేత దిల్​ఖుశ్​ కుమార్​

"మిగతా సంస్థలు రాకపోకల ఇంధన ఛార్జీలు లెక్కించి ధరను నిర్ణయిస్తాయి. కానీ మేము తిరిగి వచ్చే ఛార్జీని లెక్కించము. అందువల్ల సుమారు 40 శాతం ధర తగ్గుతుంది. ఇది వన్​ వే ట్యాక్సీ. అదే ట్యాక్సీ పూల్​లో అయితే సుమారు 60 శాతం వరకు ధర తగ్గుతుంది. ఏదైనా ట్యాక్సీ ఒక ప్రాంతానికి వెళ్లి.. తిరిగి ఖాళీగా వస్తుంటే దానికి సంబంధించిన వారి వివరాలు మా దగ్గర ఉంటాయి. అదే సమయంలో ఎవరైతే ఆ ప్రాంతం నుంచి వస్తుంటారో వారిని కనెక్ట్ చేస్తాం. దీంతో పాటు మా వాహనాన్ని బుక్​ చేసుకున్న ప్రయాణికుడు.. ఏదైనా కారణం వల్ల రైలు, బస్సు ఎక్కలేకపోతే.. ఆ ప్రయాణానికి అయ్యే ఖర్చులను మొత్తం సంస్థ భరిస్తుంది. ఇది మా బాధ్యత."

--దిల్​ఖుశ్ ​కుమార్​, రోడ్​బెజ్​ సంస్థ యజమాని

కొన్ని సంస్థలు పండగలతో పాటు రద్దీ సమయాల్లో రేట్లు పెంచుతాయని.. కానీ తమ కంపెనీ ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని దిల్​ఖుశ్ ​తెలిపాడు. ప్రస్తుతం తమ అధీనంలో 60 వాహనాలు నడుస్తుండగా.. ఈ ఏడాది చివరి వరకు ఈ సంఖ్యను 100 పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పాడు. వీటితో పాటు అనేక ట్యాక్సీలు సైతం తమ యాప్​ ద్వారా సేవలు అందిస్తున్నాయని దిల్​ఖుశ్​ చెబుతున్నాడు.

Dilkhush Kumar Rodbez
వాహనాలను పరిశీలిస్తున్న దిల్​ఖుశ్ కుమార్​

ఇంటిపైన ల్యాండ్ అయ్యే 'ఈ-ప్లేన్' ట్యాక్సీ.. ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ జర్నీ

చెత్తతో కారు తయారు చేసిన రైతు- ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు జర్నీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.