Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు.. 3,17,523 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 491 మంది మరణించారు. 2,23,990 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 93.69 శాతంగా నమోదైందని పేర్కొంది.
- మొత్తం కేసులు: 3,82,18,773
- మొత్తం మరణాలు: 4,87,693
- యాక్టివ్ కేసులు: 19,24,051
- మొత్తం కోలుకున్నవారు: 3,58,07,029
Omicron Cases In India
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 73,38,592 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,59,67,55,879కు చేరింది.
మార్చి నెలకల్లా..
మార్చి నెలకల్లా కరోనా మహమ్మారి ఎండమిక్‌గా మారనుందని ఐసీఎంఆర్‌కు చెందిన వైద్య నిపుణుడు సమీరన్ పాండా అంచనా వేశారు. 'మనం మన రక్షణ కవచాల(కొవిడ్ నిబంధనలను ఉద్దేశిస్తూ) విషయంలో అశ్రద్ధ వహించకుండా ఉంటే, కొత్త వేరియంట్లు పుట్టుకురాకపోతే.. మార్చి 11 కల్లా కరోనా వైరస్ ఎండమిక్‌గా మారనుంది. డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్‌ను భర్తీ చేస్తే.. కొవిడ్ ఎండమిక్‌గా మారుతుంది. కొత్త వేరియంట్ పుట్టుకురాకపోతే ఆ అవకాశం ఉంటుంది' అని పాండా అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 34,56,592 మందికి కరోనా సోకింది. 8,814 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 33,91,90,402కి చేరగా.. మరణాలు 55,83,277కు పెరిగింది.
- అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 7,10,928 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 2,374 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6.9 కోట్లు దాటింది.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 4,36,167 కేసులు వెలుగుచూశాయి. మరో 231 మంది చనిపోయారు.
- ఇటలీలో 1,92,320 కొత్త కేసులు బయటపడగా.. 380 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 2,05,310 మందికి వైరస్ సోకగా.. 349 మంది చనిపోయారు.
- అర్జెంటీనాలో తాజాగా 1,28,321 కరోనా కేసులు బయటపడగా.. 208 మంది బలయ్యారు.
- జర్మనీలో 1,21,952 వేల మందికి వైరస్ సోకింది. మరో 258 మంది మృతి చెందారు.
- బ్రిటన్‌లో మరో 1,08,069 వేల మంది వైరస్ బారిన పడ్డారు. 359 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి: ఏడు రోజుల్లో 1.8కోట్ల కేసులు- ఆ దేశాల్లో తగ్గిన ఒమిక్రాన్ వ్యాప్తి!