ETV Bharat / bharat

కాంగ్రెస్​ అధ్యక్ష పదవి కోసం 'డిజిటల్​' ఎన్నిక! - కేంద్ర ఎన్నికల సంస్థ

కాంగ్రెస్​ అధ్యక్ష పదవి ఎన్నికలను డిజిటల్​ విధానంలో నిర్వహించే అవకాశముంది. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్​ సీఈఏ మంగళవారం భేటీకానుంది.

Congress mulling to conduct digital voting for party president elections
కాంగ్రెస్​ అధ్యక్ష పదవి కోసం 'డిజిటల్​' ఎన్నిక
author img

By

Published : Nov 22, 2020, 5:42 AM IST

కాంగ్రెస్​ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు త్వరలో జరగబోయే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎన్నికలను డిజిటల్​ విధానంలో నిర్వహించాలన్న ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేందుకు ఆ పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల సంస్థ(సీఈఏ) మంగళవారం భేటీ కానున్నట్టు విశ్వసనీయ వర్గాలు 'ఈటీవీ భారత్​'కు తెలిపాయి.

మధుసూదన్​ మిస్త్రి కన్వీనర్​గా ఉన్న సీఈఏలో కృష్ణబైరె గౌడ, అర్విందర్​ సింగ్​ లవ్లీ, రాజేశ్​ మిశ్ర, జ్యోతిమణి సభ్యులుగా ఉన్నారు. మంగళవారం నాటి భేటీలో అఖిల భారత కాంగ్రెస్​ కమిటీ(ఏఐసీసీ) సభ్యులందరికీ డిజిటల్​ కార్డులు జారీ అంశంపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఏఐసీసీ ప్రతినిధుల జాబితాను సీఈఏ తెప్పించుకుంది. డిజిటల్​ ఫొటోలను పంపించాలని వారందరికీ సూచించింది. డిజిటల్​ ఎన్నికల నిర్ణయం ఖరారయ్యాక కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ ఆమోదం కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ 23మంది పార్టీ నేతలు సోనియా గాంధీకి లేఖ రాసిన అనంతరం అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో కదలిక వచ్చింది. పార్టీ సారథ్య బాధ్యతల్ని రాహుల్​ గాంధీ చేపట్టాలనే డిమాండ్లు వస్తున్నాయి. అయితే, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఆ పదవికి ఎవరైనా పోటీ వస్తే పోలింగ్​ నిర్వహించేందుకు సీఈఏ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:- ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడికి సీబీఐ సమన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.