ETV Bharat / bharat

'బాయ్​ఫ్రెండ్ ఉంటేనే కాలేజీలోకి అనుమతి'.. అమ్మాయిలకు కళాశాల నోటీసు! - బాయ్​ఫ్రెండ్ కాలేజీ నోటీసు

అమ్మాయిలకు బాయ్​ఫ్రెండ్స్ ఉంటేనే కాలేజీకి రావాలని ఓ కళాశాల నోటీసు జారీ చేసింది. మరీ ముఖ్యంగా ఫిబ్రవరి 14వ తేదీ లోపు ప్రతి ఒక్క అమ్మాయికి బాయ్​ఫ్రెండ్​ ఉండాలని ఆదేశించింది!. ఇప్పుడీ నోటీసు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అసలేం జరిగిందంటే..

Come to college with  boyfriend college notice

author img

By

Published : Jan 24, 2023, 4:05 PM IST

'స్టాగ్​తో ఎంట్రీ లేదంటూ నో ఎంట్రీ బోర్డే పెట్టారురో' అంటూ ఓ చిత్రంలో కథానాయకుడి పరిస్థితిని వివరించాడు ఒక సినిమా కవి. అందులో అమ్మాయిలు లేకపోతే పబ్​లోకి ఎంట్రీ ఉండదు. దానికి కొంచెం భిన్నంగా అచ్చం అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఆ కథానాయకుడికి వచ్చిన పరిస్థితే ఇక్కడ అమ్మాయిలకు వచ్చింది. బాయ్​ఫ్రెండ్​లు ఉంటేనే అమ్మాయిలు కాలేజీకి రావాలని.. లేదంటే అనుమతించబోమని చెప్పారు. ఇక్కడ నో ఎంట్రీ బోర్డు బదులు.. ఓ నోటీసు​ జారీ చేశారు!. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

Come to college with  boyfriend college notice
వైరల్​ అయిన కాలేజీ నోటీసు

జగత్​సింగ్​పుర్​ జిల్లాలోని జగత్​సింగ్​పుర్​ స్మామీ వివేకనందా మెమోరియల్​ అటోనమస్​ కాలేజీ అనే పేరుతో ఓ నోటీసు​ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అందులో ఆడపిల్లలు బాయ్​ ఫ్రెండ్స్​తో కాలేజీకి రావాలని చెప్పారు. బాయ్​ఫ్రెండ్​ లేకుంటే కళాశాలలోకి అనుమతించేది లేదని అందులో ఆజ్ఞాపించారు. " ఫిబ్రవరి 14వ తేదీ వరకు అందరు అమ్మాయిలకు కనీసం ఒక్క బాయ్​ ఫ్రెండ్​ అయినా ఉండాలి. భద్రతా కారణాలు దృష్ట్యా ఇది చేస్తున్నాం. సింగిల్​ గర్ల్స్​ను కాలేజీ పరిసరాల్లోకి అనుమతించరు. వారు తమ బాయ్​ ఫ్రెండ్​తో దిగిన లేటెస్ట్​ ఫొటో చూపించాలి. ప్రేమను పంచండి" నోటీసులో రాసుకొచ్చారు. ఆ నోటీసు​పై ఆ కాలేజీ ప్రిన్సిపాల్​ సంతకం కూడా ఉండటం గమనార్హం.

ఎస్​వీఎమ్​ కాలేజీ ప్రిన్సిపాల్

అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆ కాలేజీ ప్రిన్సిపల్ విజయ్​ కుమార్ పాత్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. "నా పేరు మీద ఓ తప్పుడు నోటీసు​ చక్కర్లు కొడుతోంది. అది పూర్తిగా అవాస్తవం. దాని గురించి మాట్లాడటం.. దాన్ని ఓ వార్తగా ప్రచారం చేయడం మంచిది కాదు. అది మా కాలేజీ నుంచి జారీ అయిన సర్క్యులర్​ కాదు. ఆ నోటీసుపై ఉంది మా లెటర్​ హెడ్​ కాదు. కొంతమంది కావాలనే మా కళాశాల పేరును చెడగొట్టడానికి ఈ పని చేశారు" అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.