థాయ్ స్మైల్ ఎయిర్వేస్లో ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది. బ్యాంకాక్ నుంచి కోల్‌కతా వెళ్తున్న విమానంలో ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటన డిసెంబర్ 26న టేక్ఆఫ్ అవుతున్న సమయంలో జరిగింది. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి నీ చేయి కిందికి దించు అనడం వినిపిస్తోంది. తర్వాత ఆ వ్యక్తిని తోటి ప్రయాణికులు అనేక సార్లు కొట్టినట్లు కన్పిస్తోంది.
తర్వాత ఇతర ప్రయాణికులు, ఎయిర్ హోస్టెస్ కలిసి వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే విమానంలో జరిగిన వివాదంపై థాయ్ స్మైల్ ఎయిర్వేస్ స్పందించింది. ఫ్లైట్‌లో జరిగిన గొడవకు సంబంధించిన నివేదికను ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సమర్పించింది. ప్రయాణీకుడు భద్రతా నియమాలను పాటించడానికి నిరాకరించినట్లు అందులో పేర్కొంది.
అయితే గతవారం డిసెంబర్ 16న ఇస్తాంబుల్ నుంచి దిల్లీకి వెళ్లే ఇండిగో విమానంలో కూడా ఇలాంటి ఘర్షణే జరిగింది. ప్రయాణికుడికి, ఎయిర్ హోస్టెస్‌కు భోజనం విషయంలో తీవ్రమైన సంభాషణ జరిగింది. అయితే ఈ ఘటనలో ఎయిర్ హోస్టెస్ కంటతడి పెట్టుకుంది. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.