ETV Bharat / bharat

వరుడిపై పరువునష్టం దావా.. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్​.. బరాత్​ అయిపోవడమే కారణం! - haridwar neqws

ఇటీవలే పెళ్లి చేసుకున్న నూతన వరుడిపై అతడి స్నేహితుడు పరువు నష్టం దావా వేశాడు. రూ.50 లక్షలు చెల్లించాలని లేకపోతే కేసు పెడతానని నోటీసు పంపాడు. అయితే ఇదంతా.. అతడు వెళ్లినప్పటికి వరుడి పెళ్లి బరాత్​ అయిపోయినందుకేనట! అసలేం జరిగిందంటే?

lapped with defamation suit
lapped with defamation suit
author img

By

Published : Jun 25, 2022, 10:33 AM IST

Updated : Jun 25, 2022, 11:28 AM IST

ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​కు చెందిన ఓ యువకుడు.. తన స్నేహితుడిపై పరువు నష్టం దావా వేశాడు. రూ.50 లక్షలు చెల్లించాలని నోటీసు పంపాడు. లేకపోతే కేసు పెడతానని చెప్పాడు. అందుకు గల కారణం తెలిస్తే షాక్​ అవ్వడం ఖాయం.. అతడు వెళ్లినప్పటికీ స్నేహితుడి పెళ్లి బరాత్​ అయిపోయిందని ఇలా చేశాడట. ఇంతకీ ఏం జరిగందంటే?

ఇదీ జరిగింది.. హరిద్వార్​లోని బహదరబాద్​ ఆరాధ్యకాలనీలో నివాసం ఉంటున్న రవి అనే యువకుడికి గురువారం వివాహం జరిగింది. అయితే కంఖాల్​ దేవ్​నగర్​లో రవి ప్రాణస్నేహితుడైన చంద్రశేఖర్​ ఉంటాడు. అయితే తన పెళ్లికి మిగతా స్నేహితులందిరికీ ఆహ్వానించమని చంద్రశేఖర్​కు రవి చెప్పాడు. ఎంతో హుషారుగా చంద్రశేఖర్​.. రవి పెళ్లికి రావాలని, దాంతో పాటు గురువారం సాయంత్రం జరిగే బరాత్​కు హజరవ్వాలని ఆహ్వానించాడు. అయితే చంద్రశేఖర్​తో పాటు వారంతా గురువారం సాయంత్రం 4.30 గంటలకే రవి ఇంటికి చేరుకున్నారు. అక్కడే మొదలైంది అసలైన గొడవ!

వీరు అక్కడికి వెళ్లినప్పటికే.. రవి పెళ్లి బరాత్​ అయిపోయింది. దీంతో వారంతా ఫీలయ్యారు. వరుడు రవికి ఫోన్​ చేసి బరాత్​ కోసం ఆరా తీశారు. అతడు పెళ్లి హడావుడిలో 'ఊరేగింపు అయిపోయిందని, మీరు వెళ్లిపోతే వెళ్లిపోండి' అని చెప్పి కాల్​ కట్​ చేశాడు. దీంతో చంద్రశేఖర్​పై మిగతా స్నేహితులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనరాని మాటలు కూడా అన్నారు. దీంతో చంద్రశేఖర్.. రవిపై కోపం పెంచుకున్నాడు.

ఆ తర్వాత స్నేహితులు.. తన దూషించడానికి రవియే ప్రధాన కారణమని చంద్రశేఖర్​ నిర్ధరించకున్నాడు. ఈ విషయంపై చంద్రశేఖర్​.. రవికి కాల్​ చేసి మాట్లాడాడు. కానీ అతడు ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మరింత కోపం పెంచుకున్న చంద్రశేఖర్​.. రవిపై పరువు నష్టం దావా వేశాడు. రూ.50 లక్షలు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నాడు. దాంతో పాటు బహిరంగంగా క్షమాపణలు చెప్పమన్నాడు. లేకపోతే కోర్డులో కేసు వేస్తానని నోటీసులో పేర్కొన్నాడు.

ఇవీ చదవండి: భార్యకు ప్రేమతో.. చంద్రుడిపై స్థలాన్ని కానుకగా ఇచ్చిన భర్త

చేత్తో నెడితేనే నిర్మాణాలు నేలమట్టం.. వీడియో వైరల్‌!

Last Updated : Jun 25, 2022, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.