తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగ సమయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. పీయూష్ గోయల్‌పై కవిత్వం చెప్పి అందరినీ అలరించారు కేంద్రమంత్రి రామదాస్ ఆథవాలే.
అథవాలే తన ద్విపదలు, కవిత్వాలతో సహజంగా అందరినీ అలరిస్తుంటారు. పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగాన్ని ముగిస్తున్న సమయంలో అథవాలే అకస్మాత్తుగా లేచి కవిత్వం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
దీనిపై స్పందించిన భాజపా ఎంపీలు, ఆర్థికమంత్రి ప్రసంగానికి అడ్డుతగలవద్దని అథవాలేకు సూచించారు.
మరో మూడు సందర్భాల్లోనూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టిని ఆకర్షించారు రామ్‌దాస్ అథవాలే. పీయూష్‌గోయల్ మధ్యతరగతి ప్రజలు, రైతుల గురించి ప్రస్తావిస్తున్న సమయంలో రామదాస్ కవిత్వం చెప్పి రాహుల్ దృష్టిని మరల్చారు.