ETV Bharat / bharat

'ఆ విద్యార్థికి ఐఐటీ సీటు తిరిగిచ్చేయండి' - సిద్ధాంత్​ బాత్రా

18ఏళ్ల సిద్ధాంత్​ బాత్రాకు అతని ఇంజినీరింగ్​ సీటు తిరిగిచ్చేయాలని ఐఐటీ బాంబేను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు మధ్యంతర అడ్మిషన్​ అవకాశాన్ని కల్పించాలని సూచించి విచారణను వాయిదా వేసింది. జేఈఈ ఎడ్వాన్సడ్​​లో 270 ర్యాంక్​ సాధించిన సిద్ధాంత్​.. ఓ తప్పు లింక్​ క్లిక్​ చేయడం వల్ల సీటును ఉపసంహరించుకున్నానని తన వ్యాజ్యంలో పేర్కొన్నాడు.

SC allows student to join IIT for his course
'ఆ విద్యార్థికి ఐఐటీ సీటు తిరిగిచ్చేయండి'
author img

By

Published : Dec 9, 2020, 4:01 PM IST

పొరపాటున ఇంజనీరింగ్​ సీటు రద్దు చేసుకున్న 18ఏళ్ల యువకుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతనికి తక్షమే మధ్యంతర అడ్మిషన్​ ఇచ్చి.. కళాశాలలో చేర్చుకోవాలని ఐఐటీ బాంబేకు ఆదేశాలిచ్చింది సర్వోన్నత న్యాయస్థానం.

తప్పు లింక్​ వల్లే!

ఆగ్రాకు చెందిన 18ఏళ్ల సిద్ధాంత్​ బాత్రా.. ఈ ఏడాది జరిగిన జేఈఈ ఎడ్వాన్సడ్​ పరీక్షలో ఆల్​ ఇండియా 270 ర్యాంకను దక్కించుకున్నాడు. ఐఐటీ బాంబేలో ఎలక్ట్రానికి ఇంజినీరింగ్​ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి సీటు కూడా వచ్చింది. కానీ అక్టోబర్​లో ఓ తప్పు లింక్​ మీద క్లిక్​ చేయడం వల్ల తన సీటును తానే ఉపసంహరించుకున్నాడు.

తనను చేర్చుకోమని ఐఐటీ-బీకి వెళ్లగా యంత్రాంగం తిరస్కరించింది. అనంతరం ఆ యువకుడు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అతడి పిటిషన్​ను కొట్టివేసింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఆ తర్వాత.. తనకు న్యాయం చేయాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్​ ఎస్​కే కౌల్​ నేతృత్వంలోని ధర్మాసనం.. ఐఐటీ బాంబేకు నోటీసులు జారీ చేసి.. విద్యార్థికి మధ్యంతర అడ్మిషన్​ అవకాశాన్ని కల్పించాలని వెల్లడించింది. తదుపరి విచారణను శీతాకాలం విరామం తర్వాతకు వాయిదా వేసింది.

ఇదీ చూడండి:- కేర్​టేకర్​పై మోసం కేసు పెట్టిన సీజేఐ తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.