ETV Bharat / bharat

''మహా' ప్రభుత్వ నిర్ణయాలతో మాకే సంబంధం లేదు' - మహరాష్ట్ర ముఖ్యమంత్రి

మహారాష్ట్రలో సర్కారు ఏర్పాటు చేయటానికే కాంగ్రెస్​ పరిమితమైందని, ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామ్యం కావటం లేదని కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ అన్నారు. పంజాబ్​, ఛత్తీస్​గడ్​, రాజస్థాన్​ రాష్ట్రాల్లోనే నిర్ణేతలుగా ఉన్నామన్నారు.

Rahul Gandhi distances Congress from Uddhav, says 'we are not decision makers in Maharashtra'
'మహా ప్రభుత్వ నిర్ణయాల్లో కాంగ్రెస్​కు సంబంధం లేదు'
author img

By

Published : May 26, 2020, 6:46 PM IST

Updated : May 26, 2020, 9:25 PM IST

మహారాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్​ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ. రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా మాత్రమే కాంగ్రెస్​ ఉందని, కీలక నిర్ణయాల్లో పార్టీ జోక్యం చేసుకోవటం లేదన్నారు.

"ఈ రెండింటి మధ్య ఉన్న తేడా గురించి చెప్పాలనుకుంటున్నాను. మేము (కాంగ్రెస్​ పార్టీ) మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నామే కానీ, ప్రభుత్వం తీసుకోనే కీలక నిర్ణయాల్లో మా భాగస్వామ్యం లేదు. పంజాబ్​, ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్, పుదుచ్చేరిలో మాత్రమే మేం నిర్ణేతలం. ప్రభుత్వానికి మద్దతు తెలపటానికి, నడపటానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

కరోనా మహమ్మారిని కట్టడి చేయటంలో ఠాక్రే ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. ఆ మరుసటి రోజే రాహుల్​ ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్రం విఫలం..

కరోనా విషయంలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు రాహుల్​. దేశంలో పూర్తి స్థాయిలో లాక్​డౌన్​ను అమలు చేయటంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

ఇదీ చూడండి:మోదీ లాక్​డౌన్ వ్యూహం​ పూర్తి విఫలం: రాహుల్​

Last Updated : May 26, 2020, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.