
" దేశంలో చాలా ఏళ్ల నుంచి న్యాయమూర్తుల కొరత ఉంది. 5వేల జిల్లా జడ్జి పోస్టుల నియామకంతో పాటు.. కోర్టు గదులు, న్యాయమూర్తుల భవనాల నిర్మాణానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ అంశంపై ఆయారాష్ట్రాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. 5వేల ఖాళీలలో సుమారు 75శాతం నియామకం 2019 చివరిలోపు పూర్తవుతాయని ఆశిస్తున్నాం.
దేశవ్యాప్తంగా 394 హైకోర్టు జడ్జి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 270 నియామకాలకు హైకోర్టులు సిఫార్సు చేయాల్సి ఉంది. మిగిలిన 124 పోస్టుల భర్తీకి ప్రక్రియ నడుస్తోంది. ఈ 124 పోస్టుల్లో వంద స్థానాల భర్తీ అంశం సుప్రీం కోర్టు కొలిజీయం ముందుండగా.. 14 పోస్టుల భర్తీ ప్రక్రియ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిశీలనలో ఉంది.
అందువల్ల హైకోర్టు జడ్జిల నియామకంలో జరుగుతున్న జాప్యంలో ఎవరినీ నిందించాల్సిన పనిలేదు. సుప్రీం పరిధిలో ఉన్న వంద పోస్టుల భర్తీని రెండు ముడు వారాల్లోగా పూర్తి చేస్తాం. "
-జస్టిస్ రంజన్ గొగోయ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి