ETV Bharat / bharat

యూపీలో మరో దారుణం.. దళిత యువతిపై గ్యాంగ్​ రేప్​ - dalitha mahila pai atyacharam

ఉత్తర్​ప్రదేశ్​లో మహిళలపై అత్యాచార ఘటనలు ఆగడం లేదు. 'హాథ్రస్​' హత్యాచార ఘటన మరువకముందే.. తాజాగా మరో దారుణం జరిగింది. ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

gang rape on dalith woman in uttar pradesh dehat district
యూపీలో మరో దారుణం.. దళిత మహిళపై గ్యాంగ్​ రేప్​
author img

By

Published : Oct 18, 2020, 8:54 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ దేహత్​ జిల్లాలో దారుణం జరిగింది. మరో దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సర్పంచ్​ సహా..

22 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయని ఆమెను బెదిరించారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ అత్యాచార విషయం బహిర్గతమైంది. నిందితుల్లో మాజీ సర్పంచ్​ కూడా ఉన్నారని వారు పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఎస్పీ కేశవ్​ కమార్​ చౌదరి తెలిపారు.

ఇదీ చూడండి:తాగుబోతు వీరంగానికి ఒకరు బలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.