ETV Bharat / bharat

'మహా'లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. మంత్రికీ వైరస్​ - బీఎంసీ

దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 778 మంది వైరస్​ బారినపడినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఓ మంత్రికి కూడా కరోనా సోకింది. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 283కు పెరిగింది.

A record 778 new COVID-19 cases in Maha
'మహా'లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. మంత్రికీ వైరస్​
author img

By

Published : Apr 24, 2020, 5:12 AM IST

మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6 వేలు దాటింది. వాటిలో కేవలం ముంబయిలోనే కేసుల సంఖ్య 4 వేలు దాటడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 778 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,427కి చేరింది. మరో 14 మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 28కి చేరింది.

మంత్రికి కరోనా..

మహారాష్ట్రలో ఓ మంత్రికి కరోనా వైరస్​ సోకినట్లు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయన ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.

ముంబయిలో గురువారం ఒక్కరోజే కొత్తగా 478 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు బృహన్​ ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్(బీఎంసీ)​ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,232కి చేరింది. తాజాగా 8 మంది మరణించడంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 168కి చేరిందని స్పష్టం చేసింది బీఎంసీ.

పుణెలో కొత్తగా 104 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 3 మరణాలతో.. నగరంలో మొత్తం 63 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ముగ్గురు ఎస్​ఆర్​పీఎఫ్​ జవాన్లకు కరోనా సోకగా.. వీరిని ఆస్పత్రిలో చేర్పించినట్లు అధికారులు తెలిపారు.

ఠాణెలో మరో 42 మందికి కరోనా బారినపడగా.. మొత్తం బాధితుల సంఖ్య 542కు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.