ETV Bharat / bharat

జవాన్ల కోసం 3డీ ప్రింటెడ్ ఇళ్లు.. భూకంపం వచ్చినా సేఫ్.. 'ఆత్మనిర్భర్​ భారత్'​లో భాగంగా..

సైన్యం కోసం అహ్మదాబాద్​లో తొలి 3డీ ప్రింటెడ్ గృహ సముదాయాన్ని ప్రారంభించినట్లు కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ సహాయంతో కేవలం 12 వారాల్లోనే ఈ నిర్మాణాలు పూర్తి చేసినట్లు పేర్కొంది.

army 3d printed units
ఆర్మీ 3డీ ప్రింటెడ్ గృహాలు
author img

By

Published : Dec 29, 2022, 6:05 PM IST

గుజరాత్​ అహ్మదాబాద్​లోని కంటోన్మెంట్​లో సైనికుల కోసం తొలి 3డీ ప్రింటెడ్‌ గృహ సముదాయాన్ని ప్రారంభించినట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మికాబ్ ప్రైవేట్ లిమిటెడ్​ అనే సంస్థతో కలిసి మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్.. ఈ త్రీడీ నిర్మాణాలను చేపట్టినట్లు పేర్కొంది.

army 3d printed units
3డీ ప్రింటెడ్ గృహ సముదాయం

71 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇళ్ల నిర్మాణానికి కేవలం 12 వారాలు పట్టినట్లు అధికారులు తెలిపారు. స్లాబ్​లు, గోడలతో పాటు పునాదులను సైతం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతోనే రూపొందించినట్లు చెప్పారు. భూకంపాలు, ఇతర ప్రకృతి విపత్తులను తట్టుకునే విధంగా ఈ నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. త్రీడీ నిర్మాణాల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన కాంక్రీట్​ను ఇందులో వినియోగించినట్లు వివరించారు.

army 3d printed units
3డీ ప్రింటెడ్ గృహ నిర్మాణాలు

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్​ను ప్రోత్సహించడంలో సైన్యం నిబద్ధతను ఈ నిర్మాణాలు చాటి చెబుతాయని అధికారులు పేర్కొన్నారు. 3డీ టెక్నాలజీ ద్వారా తక్కువ సమయంలో నిర్మాణాలు చేపట్టవచ్చని వెల్లడించారు. ఇప్పటికే.. అత్యాధునిక 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి తూర్పు లద్దాఖ్​లో వాస్తవాధీన రేఖ వెంబడి పలు నిర్మాణాలు చేపట్టినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. దీని వల్ల పెద్ద ఎత్తున సమయం ఆదా అయిందని పేర్కొన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.