ETV Bharat / bharat

గోవా ఆసుపత్రిలో ఆక్సిజన్​ అందక 76మంది మృతి

76-people-died-in-goa-hospital-due-to-lack-of-oxygen
గోవా ఆసుపత్రిలో ఆక్సిజన్​ అందక 76మంది మృతి
author img

By

Published : May 14, 2021, 12:24 PM IST

Updated : May 14, 2021, 2:55 PM IST

11:55 May 14

ఆక్సిజన్​ అందక 76మంది మృతి

గోవా వైద్య కళాశాల ఆసుపత్రి(జీఎంసీహెచ్​)లో ఆక్సిజన్​ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.  ప్రాణవాయువు కొరతతో అక్కడ శుక్రవారం వేకువ జామున మరో 13 మంది మరణించారు. దీంతో గత నాలుగు రోజుల్లేనే ఆక్సిజన్​ లేక మొత్తం 75 మంది కరోనా రోగులు చనిపోయారు.

ఈ ఆస్పత్రిలో కరోనా రోగుల మరణాలకు సంబంధించి బొంబాయి హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరగడం ఆందోళన కలిగిస్తోంది. జీఎంసీహెచ్​లో రోగుల మృతికి గల కారణాన్ని గోవా ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే మెడికల్​ ఆక్సిజన్​ను రోగులకు సరఫరా చేసే విషయంలో లాజిస్టిక్ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం గురువారం కోర్టుకు తెలిపింది.

జఎంసీహెచ్​ ఆస్పత్రిలో ఆక్సిజన్ సమస్య కారణంగా మంగళవారం 26 మంది, బుధవారం 21 మంది, గురువారం 15 మంది, శుక్రవారం 13మంది కరోనా రోగులు చనిపోయారు. 

ఆక్సిజన్​ ట్రాలీలను తీసుకొచ్చే ట్రాక్టర్ల లాజిస్టిక్ సమస్యలు​, ఆస్పత్రిలోని ఆక్సిజన్ సిలిండర్లను అనుసంధానించే క్రమంలో సమస్యల కారణంగా రోగులు చనిపోయారని గురువారం గోవా ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

విపక్షాల మండిపాటు

గోవా ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ కొరతపై విపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.

378 మంది..

గోవాలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ కొరత కారణంగా  ఏప్రిల్​ 30- మే 11 మధ్య 378మంది మరణించినట్టు ప్రభుత్వం హైకోర్టుకు గురువారం వెల్లడించింది.

Last Updated : May 14, 2021, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.