ETV Bharat / snippets

భర్తకు మద్యం తాగించి- మహిళపై సామూహిక అత్యాచారం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 17, 2024, 8:12 PM IST

Three unknown Persons Raped a Woman in Eluru District
Three unknown Persons Raped a Woman in Eluru District (ETV Bharat)

Three unknown Persons Raped a Woman in Eluru District : ఏలూరు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. పొట్టకూటి కోసం వలస వచ్చిన ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి పరారయ్యారు. దొరికిన పనిచేసుకుంటూ బతుకు బండిని లాగుదామని ఓ మహిళ భర్తతో పాటు నిన్న(శుక్రవారం) రాత్రి సమయంలో ఏలూరుకి వచ్చింది. రాత్రి సమయం కాబట్టి పడుకోవడానికి ఒక చోటు వేతుక్కొని తలదాచుకున్నారు. అంతలోనే ఆ జంటను గమనించిన ముగ్గురు యువకులు వారి వద్దకు వచ్చి మాటమంతి కలిపారు. అనంతరం ఆమె భర్తకు మద్యం తాపించి, మహిళను శారీరకంగా సహకరించాలని కోరారు. లేకపోతే తన భర్తను చంపేస్తామని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు వాపోయారు. అర్థరాత్రి సమయంలో ఏడుస్తున్న ఆ మహిళను గమనించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.