ETV Bharat / snippets

వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలి- మహిళ కమిషన్‌కు ఫిర్యాదు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 10:24 PM IST

VENUSWAMY CONTROVERSY COMMENTS
Complaint against Venuswamy (ETV Bharat)

Complaint against Venuswamy : జాతకాల పేరుతో సామాజిక మాద్యమాల్లో నటీనటుల వ్యక్తిగత జీవితాలను అబాసుపాలు చేస్తున్న వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు తెలుగు ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడయా అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఇటీవల అక్కినేని నాగచైతన్య- శోభితల నిశ్చితార్థం రోజున జాతకాలను విశ్లేషిస్తూ వేణుస్వామి వీడియో చేయడం వివాదంగా మారింది. అలాగే సినిమాల విడుదల, రాజకీయ ఫలితాలపై కూడా వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మహిళా కమిషన్ ఛైర్మన్ నీరెళ్ల శారదకు ఫిర్యాదు చేశారు. స్పందించిన మహిళా కమిషన్ ఛైర్మన్, సదరు వేణుస్వామిని పిలిపించి వివరణ తీసుకోవడంతోపాటు ఆ వీడియోలను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్స్ పై కూడా చర్యలు తీసుకోనున్నట్లు శారద హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.