ETV Bharat / snippets

వరదల వేళ టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం - ఆ మార్గంలో టికెట్ ధరలపై 10% డిస్కౌంట్

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 3:49 PM IST

Telangana RTC Discount 2024 :
Telangana RTC Discount 2024 : (ETV Bharat)

Telangana RTC Discount 2024 : తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీటమునగడం, భారీ వరద పోటెత్తి రహదారులు ధ్వంసం కావడంతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ - విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్‌ ధరలో 10 శాతం డిస్కౌంటు ప్రకటించింది. రాజధాని, ఏసీ, సూపర్‌ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించింది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://www.tgsrtcbus.inలో టికెట్లు బుక్‌ చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.