ETV Bharat / snippets

డ్రగ్స్ కేసులో టాంజానియా యువతికి 12 ఏళ్ల జైలు శిక్ష

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 9:22 PM IST

Updated : Jul 12, 2024, 9:44 PM IST

TANZANIA LADY DRUG CASE HYD
Tanzania Lady punished For 12 years in Drug Case (ETV Bharat)

Tanzania Lady punished For 12 years in Drug Case : గతంలో హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసుకొస్తూ అధికారులకు చిక్కిన టాంజానియా యువతికి రంగారెడ్డి జిల్లా కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. 2021లో టాంజానియా నుంచి నగరానికి డ్రగ్స్‌ తీసుకొస్తుండగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో డీఆర్​ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

తినుబండారాల రూపంలో మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆమె వద్ద నుంచి 19 కోట్ల రూపాయల విలువ చేసే మూడు కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలిని అరెస్టు చేసి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు నిందితురాలికి 12 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

Last Updated : Jul 12, 2024, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.