ETV Bharat / sports

బ్యాడ్మింటన్​ సెమీస్​లో భారత్​కు నిరాశ - బ్రాంజీ పోరులో లక్ష్యసేన్​ - Lakshya Sen Paris Olympics 2024 - LAKSHYA SEN PARIS OLYMPICS 2024

Lakshya Sen Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్​లో భాగంగా తాజాగా జరిగిన బ్యాడ్మింటన్‌ సెమీస్‌లో లక్ష్య సేన్ ఘోరా పరాజయం పాలయ్యాడు. డెన్మార్క్‌ ప్లేయర్ అక్సెల్సన్‌ చేతిలో 20-22, 14-21 తేడాతో ఓటమి.

Lakshya Sen
Lakshya Sen (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 4, 2024, 4:33 PM IST

Updated : Aug 4, 2024, 5:05 PM IST

Lakshya Sen Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్​లో భాగంగా తాజాగా జరిగిన బ్యాడ్మింటన్‌ సెమీస్‌లో లక్ష్య సేన్ ఘోర పరాజయం పాలయ్యాడు. డెన్మార్క్‌ ప్లేయర్ అక్సెల్సన్‌ చేతిలో 20-22, 14-21 తేడాతో ఓటమిని చవిచూశాడు. అయితే ఆగస్టు 5న జరగనున్న కాంస్య పతక పోరులో మలేసియా ప్లేయర్ లీ జీ జియాతో తలపడనున్నాడు.

మ్యాచ్ సాగిందిలా :
ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో తొలి గేమ్‌ ఆరంభంలోనే వెనుకబడినట్లు కనిపించిన లక్ష్యసేన్, ఆ తర్వాత వేగం పుంజుకున్నాడు. ఒకానొక దశలో 15-11తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే అక్సెల్సెన్‌ క్రమంగా తన జోరును పెంచాడు. దీంతో లక్ష్యసేన్‌ మూడు గేమ్‌ పాయింట్‌లను వృథా చేసుకున్నాడు.

మరోవైపు అక్సెల్సెన్‌ వరుసగా ఐదు పాయింట్లు సాధించి ఈ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో లక్ష్యసేన్‌ 7-0తో భారీ ఆధిక్యాన్ని కనబరిచినప్పటికీ ఆ తర్వాత ప్రత్యర్థి గేమ్​ చూసి తేలిపోయాడు. ఇక డెన్మార్క్‌ షట్లర్‌ కూడా జోరు పెంచి వరుసగా పాయింట్లు సొంతం చేసుకున్నాడు. గట్టిగా పోటీనిచ్చి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

ఈ పోటీల్లోనూ నిరాశే
మరోవైపు ఆదివారం వివిధ పోటీల్లోనూ భారత్​కు నిరాశే ఎదురైంది. షూటింగ్ స్కీట్‌ మహిళల క్వాలిఫికేషన్‌లో మహేశ్వరి చౌహాన్, రైజా ధిలాన్ ఓటమిపాలయ్యారు. ఐదు రౌండ్లలో మహేశ్వరి 118 పాయింట్లు (14వ స్థానం), ధిలాన్ 113 పాయింట్లు (23వ స్థానం) నిలిచారు. అయితే మొదటి ఆరు స్థానాల్లో ఉన్నవారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. దీంతో ఈ ఇద్దరూ వెనుతిరిగారు.

ఇక పురుషుల లాంగ్‌జంప్‌ క్వాలిఫికేషన్‌లో జెస్విన్‌ అల్డ్రిన్‌ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే 8.15 మీటర్లు జంప్‌ చేయాల్సి ఉండగా, మొదటి రెండు ప్రయతాల్లోనూ జెస్విన్‌ ఫౌల్ చేశాడు. ఇక చివరి ప్రయత్నంలో 7.61 మీటర్లు జంప్‌ చేశాడు. దీంతో ఈ యంగ్ ప్లేయర్ ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించాడు.

ఇదిలా ఉండగా, మహిళల 3000మీ. స్టీపుల్‌ఛేజ్‌లో తొలి రౌండ్‌లో పారుల్ చౌదరి (9:23:39 నిమిషాలు) ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌కు వెళ్తారు. దీంతో ఈ ఈవెంట్​లోనూ భారత్​కు నిరాశ తప్పలేదు.

పారిస్ ఒలింపిక్స్​లో​ నా ప్రదర్శనపై సంతృప్తిగా లేను : సరబ్​ జోత్​ - Paris Olympics 2024 Sarabjot Singh

మనుబాకర్​లో స్ఫూర్తి నింపిన ఆ టాటూ - దీని గురించి మీకు తెలుసా? - Paris Olympics 2024 Manu Bhaker

Last Updated : Aug 4, 2024, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.