ETV Bharat / snippets

హైడ్రా పని తీరుపై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ ఎంపీ భారీ విరాళం - ఎంత ఇచ్చారంటే?

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 7:50 PM IST

Updated : Aug 29, 2024, 7:55 PM IST

MP ANIL KUMAR DONATES TO HYDRA
MP Anil Kumar Yadav Praises HYDRA (ETV Bharat)

MP Anil Kumar Yadav Praises HYDRA : హైదరాబాద్‌ మహానగరంలో హైడ్రా కనబరుస్తున్న పని తీరుపై హర్షం వ్యక్తం చేస్తూ రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, తన ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలు హైడ్రాకు ఇచ్చారు. ధైర్యంగా పని చేసే పోలీసు అధికారి రంగనాథ్‌ను నియమించడాన్ని ఆయన అభినందించారు. హైడ్రా పనితీరు బేషుగ్గా ఉందని, అందుకే అది చేస్తున్న సేవల్లో కొంతైనా తాను పాలు పంచుకోవాలని భావించి ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు.

హైడ్రాకు రూ. 25 లక్షల చెక్కును కమిషనర్‌ రంగనాథ్‌కు అందజేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్, హైదరాబాద్ నగరంలో చెరువులు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి భవిష్యత్ తరాల గురించి అలోచించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. రాజకీయాల కోసం హైడ్రాను కొందరు విమర్శిస్తున్నారని, ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టినా హైడ్రా వదిలిపెట్టదని హెచ్చరించారు.

Last Updated : Aug 29, 2024, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.