Minister Nara Lokesh review meeting: ఐటీ శాఖపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహకాలును అధికారులను అడిగితెలుసుకున్నారు. త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తామని పేర్కొన్నారు. పెట్టుబడి అనుకూల విధానాలతో కొత్త ఐటీ పాలసీ తెస్తామని వెల్లడించారు. విశాఖను ఐటీ హబ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు. పేరున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని లోకేశ్ అధికారులకు సూచించారు.
ఐటీ శాఖపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 15, 2024, 8:54 PM IST