Minister Nara Lokesh Apology to Common Man : ప్రజాదర్భార్‌లో సమస్య చెప్తే పరిష్కరించకుండా పరిష్కరించేసినట్లు సందేశం వచ్చిందంటూ అభిషేక్ అనే వ్యక్తి పెట్టిన పోస్ట్‌పై మంత్రి లోకేశ్ క్షమాపణలు కోరారు. కర్నూలు జిల్లాలోని తన ఇంటి పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం ఉందంటూ అభిషేక్ ప్రజాదర్భార్‌లో వినతిపత్రం ఇచ్చారు. సమస్య పరిష్కారం అయ్యిందంటూ ఈ నెల 9న కర్నూలు కలెక్టర్ కార్యాలయం నుంచి అభిషేక్‌కు సందేశం వచ్చింది. అపరిష్కృత సమస్యపై సానుకూల స్పందన రావటంపై అభిషేక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. అభిషేక్ పోస్ట్‌పై స్పందించిన లోకేశ్ సంబంధించిన శాఖ తరపున తాను క్షమాపణలు చెప్తున్నా అని మంత్రి అన్నారు. తన బృందం సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను వీలైనంత త్వరగా పరిషరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సమస్య పరిష్కరాన్ని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని లోకేశ్ తెలిపారు.
అధికారుల తప్పిదం- క్షమాపణలు కోరిన మంత్రి లోకేశ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 17, 2024, 8:03 PM IST