ETV Bharat / snippets

మద్యం మత్తులో భార్యను చంపిన భర్త - కారణం ఏమిటో తెలుసా?

Man Killed His Wife in Hyderabad
Man Attack his Wife With Knife in Secunderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 19, 2024, 10:42 AM IST

Man Killed His Wife in Hyderabad : ఓ వ్యక్తి మద్యం మత్తులో తన భార్యపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. సికింద్రాబాద్​లోని అడ్డ గుట్ట పోచమ్మ దేవాలయం వద్ద నివసిస్తున్న లక్ష్మణ్, రోజా దంపతులు తరచూ గొడవలు పడతుండేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి లక్ష్మణ్ మద్యం తాగి వచ్చి తన భార్య రోజాపై కత్తితో దాడి చేశాడని తెలిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ దంపతుల స్వస్థలం రామగుండంగా గుర్తించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానం రావడమే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.