ETV Bharat / snippets

యానిమల్​ కీపర్​పై సింహం దాడి - తెలంగాణ జూపార్క్​లో ఘటన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 9:26 PM IST

Lion Attack on Keeper
Lion Attack on Keeper (ETV Bharat)

Lion Attack on Keeper: యానిమల్​ కీపర్​పై సింహం దాడి చేసిన ఘటన తెలంగాణలో హైదరాబాద్​లోని నెహ్రూ జూలాజికల్​ పార్క్​లో చోటుచేసుకుంది. బాధితుడికి చేతులకు గాయాలు కాగా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సింహాల ఎన్​క్లోజర్​ వద్ద కొంత కాలంగా హుస్సేన్​ యానిమల్​ కీపర్​గా పని చేస్తున్నాడు. సోమవారం సింహాలు ఉండే ఎన్​క్లోజర్ శుభ్రం చేయడానికి వెళ్లాడు.

అక్కడ శిరీష అనే 8ఏళ్ల ఆడ సింహాన్ని పక్కన ఉన్న మరొక ఎంక్లోజర్​లోకి పంపించాడు. కానీ గడియ పెట్టడం మరిచిపోయి ఇంకో ఎన్​క్లోజర్​ను శుభ్రం చేస్తుండగా సింహం అక్కడికి వచ్చి అతడిపై పంజా విసిరింది. భయపడిపోయిన హుస్సేన్ ఎన్​క్లోజర్​కు బోల్ట్​ పెట్టకుండా అక్కడి నుంచి పరుగులు తీశాడు. దీంతో సింహం కూడా బయటకు పరుగులు తీసింది. సమాచారం అందుకున్న జూ అధికారులు వెటర్నరీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. డాట్​ పద్ధతిలో సింహానికి మత్తుమందు ఇచ్చి ఎన్​క్లోజర్​లోకి వదిలేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.