ETV Bharat / snippets

ఏలూరు జిల్లాలో చిరుత సంచారం - భయాందోళనలో స్థానికులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 10:16 PM IST

Leopard Migration in Forest Area of ​​Eluru District
Leopard Migration in Forest Area of ​​Eluru District (ETV Bharat)

Leopard Migration in Forest Area of ​​Eluru District : ఏలూరు జిల్లాలో ఓ చిరుత సంచరించటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలవరం మండలంలోని మారమూల ఏజెన్సీ గ్రామమైన సున్నాలగండి అటవీ ప్రాంతంలో మేకపై చిరుత దాడి చేసి చంపిన ఘటన తాాజాగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి తన మేకలను అడవికి తోలుకొని వెళ్లి ఇంటికి వచ్చి చూసుకోనగా మందలో ఒక మేక తప్పిపోయినట్లు గుర్తించాడు. అనుమానంతో ఈరోజు ఉదయం అటవీ ప్రాంతంలోకి వెళ్లి చూడగా సగం తినేసిన మేక కళేబరాన్ని గుర్తించాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్ధాలానికి చేరుకున్న అధికారులు చిరుత పాదముద్రలను సేకరించారు. అయితే చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.