ETV Bharat / snippets

'అప్పు తీసుకుని ఇవ్వకుండా బెదిరిస్తున్నాడు' - అనంత ఏఎస్పీపై లోకేశ్​కు మహిళ ఫిర్యాదు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 12:41 PM IST

Ananthapuram ASP Victims Met Nara lokesh
Ananthapuram ASP Victims Met Nara lokesh (ETV Bharat)

Ananthapuram ASP Victims Met Nara lokesh : అనంతపురం ఏఎస్పీగా పని చేస్తున్న తియోపిల్లాస్ డబ్బులు తీసుకుని ఇవ్వకుండా వేధిస్తున్నారని గుంటూరు జిల్లాకు చెందిన మరియమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేశ్​ను కలిసి తియోపిల్లాస్‌పై ఫిర్యాదు చేశారు. తియోపిల్లాస్ గతంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా పని చేశారు. ఏఎస్పీ తియోపిల్లాస్ తమకు డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని లోకేశ్ ముందు మరియమ్మ కుటుంబం కన్నీటి పర్యంతమైంది. 14 ఏళ్ల క్రితం రూ.5 లక్షలు అప్పుగా తీసుకుని డబ్బులు ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అనంతపురం ఏఎస్పీగా ఉన్న తియోపిల్లాస్ వడ్డీతో కలిపి 22 లక్షల రూపాయలు తనకు ఇవ్వాలని మరియమ్మ తెలిపారు. పొలం తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చానన్నారు. డబ్బులు ఇవ్వకుండా చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తన సమస్యను పరిష్కరిస్తానని లోకేశ్​ హామీ ఇచ్చారని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.