ETV Bharat / snippets

ఏఆర్ కానిస్టేబుల్ ప్రతాప్‌ను దూరంపెట్టిన కడప ఎస్పీ- విధులు చూసుకోవాలని ఆదేశం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 19, 2024, 11:44 AM IST

SP_Harshavardhan_Raju_Action_Against_AR_Constable_Pratap
SP_Harshavardhan_Raju_Action_Against_AR_Constable_Pratap (ETV Bharat)

SP Harshavardhan Raju Action Against AR Constable Pratap: కడప ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ప్రతాప్ ఎస్పీ స్థాయిలో పెత్తనం చెలాయించడంతో కొత్తగా వచ్చిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు అతడిని దూరం పెట్టారు. గడచిన నాలుగేళ్లుగా ఇద్దరు ఎస్పీలు అన్బురాజన్, సిద్ధార్థ కౌశల్ వద్ద అనధికారిక పీఏగా కొనసాగుతూ సివిల్ పంచాయితీలో తల దూర్చినట్లు ఏఆర్ కానిస్టేబుల్ ప్రతాప్​పై అభియోగాలు ఉన్నాయి. ఈటీవీ భారత్​లో ప్రతాప్‌ పంచాయితీలపై వార్తలు రావడంతో కొత్తగా వచ్చిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు.. అతడిని దూరం పెట్టారు. ఛార్జ్ తీసుకున్న వెంటనే ప్రతాప్ ప్రవర్తనపై దృష్టి సారించిన ఎస్పీ.. తన కార్యాలయం వద్దకు రావద్దని ఏఆర్ కానిస్టేబుల్ విధులు చూసుకోవాలని సూచించినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.