ETV Bharat / snippets

సహారా గ్రూప్​ డైరెక్టర్ రావిపాటి రామకోటేశ్వరరావు అరెస్ట్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 7:34 AM IST

SAHARA GROUP DIRECTOR ARREST IN HYD
Sahara Director Arrested (ETV Bharat)

Sahara Director Arrested : సహారా ఇండియా క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆల్ ఇండియా డైరెక్టర్ రావిపాటి రామకోటేశ్వరరావును హైదరాబాద్ సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సహారా క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల డిపాజిట్లు సంస్థ సేకరించింది. వాటిని తిరిగి చెల్లించకపోవడంతో సంస్థ ఛైర్మన్ సుబ్రతా రాయ్ గతంలో జైలుకు వెళ్లాడు. బెయిల్​పై వచ్చాక కొన్ని రోజులకు అతడు మరణించాడు. అనంతరం సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న రావిపాటి రామకోటేశ్వరరావుపై సుమారుగా 744 నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి.

కొన్ని నెలలుగా రామకోటేశ్వరరావు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇటీవల న్యాయస్థానం జారీ చేసిన 15 వారెంట్​లు నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వెళ్లింది. దీంతో సీసీఎస్ పోలీసులకు అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని, సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.