ETV Bharat / snippets

వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్​పై హైకోర్టులో విచారణ - 3 వారాలకు వాయిదా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 20, 2024, 3:26 PM IST

HC ON MP YV SUBBA REDDY PETITION
HC ON MP YV SUBBA REDDY PETITION (ETV Bharat)

High Court on YSRCP Leader Subba Reddy Petition: తనకు 2+2 గన్‌మెన్‌ను కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ సమాచారం లేకుండా గన్‌మెన్‌లను ప్రభుత్వం తొలగించిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాల తర్వాత 2+2 కల్పించారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. సెక్యూరిటీ రివిజన్ కమిటీ పరిశీలనలో సుబ్బారెడ్డి ప్రాణహాని లేదని చెప్పినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్​కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ సమయం కోరారు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.