ETV Bharat / snippets

నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 2:45 PM IST

Heavy Rain in Telangana
Heavy Rain Alert To Several Districts Of Telangana (ETV Bharat)

Heavy Rain Alert To Several Districts Of Telangana : రాష్ట్రంలో ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్​కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.