ETV Bharat / snippets

పేపర్​ లెస్ కేబినెట్ సమావేశాలు- మంత్రులకు ఐప్యాడ్​లు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 3:58 PM IST

Govt Decided to Conduct E-Cabinet Meetings
Govt Decided to Conduct E-Cabinet Meetings (ETV Bharat)

Govt Decided to Conduct E-Cabinet Meetings: రాష్ట్రంలో కాగిత రహిత కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగిత రహిత కేబినెట్‌లో భాగంగా మంత్రులకు ఐప్యాడ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇకపై క్యాబినెట్ సమావేశాలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లోనే జరుగుతాయని ముఖ్యమంత్రి గత క్యాబినెట్‌లో మంత్రులకు తెలిపారు. 2017లోనూ సీఎంగా చంద్రబాబు కాగిత రహిత క్యాబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. అజెండా అంశాల ఆధారంగా ప్రతి క్యాబినెట్ సమావేశానికి ప్రభుత్వం 40 సెట్ల నోట్స్ ముద్రిస్తున్నారు. ఇకపై ఆ నోట్స్ అన్నీ సాఫ్ట్ కాపీల రూపంలో మంత్రులకు, సంబంధిత అధికారులకూ ప్రభుత్వం అందజేయనుంది. ఈ- కేబినెట్ వల్ల ప్రింటింగ్ ఖర్చులు ఆదా కావడంతో పాటు లీకేజీల నియంత్రణ సాధ్యమవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.