Gajwel People About Double Bedroom houses Issue : గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీలో లక్కీ డ్రా పద్దతి ద్వారా వచ్చిన తమ ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆగం చేసిందని లబ్దిదారులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇళ్లను ఇప్పించాలని కోరుతూ గజ్వేల్‌లోని లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
గతంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ ఇంటి ముందు కూడా ఆందోళన చేశారు. అధికారులు, నాయకులు, కార్యాలయాల చుట్టూ తిరిగి ఓపిక నశించిందని, ఒక వేళ ఇళ్లు ఇవ్వకపోతే వారికి కేటాయించి ఇళ్లలోకి తలుపులు పగలగొట్టి వెళ్తామని అన్నారు.