ETV Bharat / snippets

78 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో జెండా ఎగిరింది- పవన్​ ఆదేశాలకు కారణం ఏమిటంటే?

First Time hoisted National Flag at Jamiguda Panchayat
First Time hoisted National Flag at Jamiguda Panchayat (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 16, 2024, 7:29 PM IST

First Time hoisted National Flag at Jamiguda Panchayat : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 78 ఏళ్లకు ఆ పంచాయతీలో తొలిసారి మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. మావోయిస్టుల ఆంక్షల కారణంగా ఇప్పటివరకూ జెండా పండుగా నోచుకోలేదు. కానీ ఈసారి ప్రతి పంచాయతీలో జాతీయ జెండా ఎగురవేయాలని డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపుతో తొలిసారి అక్కడ అడుగులు పడ్డాయి. పోలీసుల రక్షణ, ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం జామిగుడ పంచాయతీ కేంద్రంలో తొలిసారిగా జాతీయ జెండా ఎగరవేశారు. సచివాలయ, పాఠశాల ఉద్యోగులు స్థానిక విద్యార్థులతో కలిసి స్వాతంత్య్ర ఉత్సవాన్ని గ్రామ పండుగలా చేసుకున్నారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. తొలిసారి జెండా ఎగురవేయడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.