ETV Bharat / snippets

సరుకు రవాణాలో ఈస్ట్ కోస్ట్ రైల్వే సరికొత్త రికార్డ్ - 160 రోజుల్లో 100 మిలియన్ టన్నులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2024, 3:18 PM IST

EAST COAST RAILWAY NEW RECORD
EAST COAST RAILWAY NEW RECORD (ETV Bharat)

East Coast Railway Sets a New Freight Loading Record : సరుకు రవాణాలో ఈస్ట్ కోస్ట్ రైల్వే కొత్త రికార్డ్ నెలకొల్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం 160 రోజుల్లో 100 మిలియన్ టన్నుల సరుకును అన్‌లోడ్ చేసి చరిత్ర సృష్టించింది. ఈ నెల 7 న 100.44 మిలియన్ టన్నులను విజయవంతంగా అన్‌లోడ్ చేయడం ద్వారా సరుకు రవాణాలో చెప్పుకోదగ్గ మైలురాయి సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి 6.5% వృద్ధిని నమోదు చేసింది. ఖుర్దా రోడ్ డివిజన్‌లో 60.38 మిలియన్ టన్నులు, వాల్తేర్ డివిజన్‌లో 22.68 మిలియన్ టన్నులు, సంబల్పూర్ డివిజన్లో 17.38 మిలియన్ టన్నులు అన్‌లోడింగ్ చేయడం ద్వారా ఈ ఘనతను సాధించినట్లు తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.