ETV Bharat / snippets

విశాఖ ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై స్పందించిన సీఎంవో

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 17, 2024, 2:41 PM IST

Updated : Jul 18, 2024, 10:29 AM IST

CMO_Reaction_on_Visakha_Red_Clay_Dunes_Issue
CMO_Reaction_on_Visakha_Red_Clay_Dunes_Issue (ETV Bharat)

CMO Reaction on Visakha Red Clay Dunes Issue: విశాఖ ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై సీఎంవో(AP CM Office) స్పందించింది. జిల్లా అధికారులతో మాట్లాడి తవ్వకాలు నిలిపి వేయించింది. ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై కలెక్టర్‌ నుంచి సీఎంవో నివేదిక కోరింది. పర్యావరణానికి హాని చేసే చర్యలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో విశాఖ భీమిలి ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసానికి గురయ్యాయి. అక్కడ భారీ యంత్రాలతో నిర్మాణ పనులు చేపట్టడం వల్ల వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. భౌగోళిక చరిత్ర ఆనవాళ్లకు నిదర్శంగా ఉన్న విశాఖ భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పరిరక్షించాలని పర్యావరణ వేత్తలు గళమెత్తారు. దీనిపై మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : Jul 18, 2024, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.