ETV Bharat / snippets

ప్రజా భవన్‌లో భట్టి విక్రమార్క విందు - హాజరైన సీఎం రేవంత్‌ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 10:32 PM IST

DY CM BHATTI ARRANGE DINNER PARTY
CM Revanth Attend Bhatti Dinner Party (ETV Bharat)

CM Revanth Attends Bhatti Dinner Party : ఇవాళ అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్ధికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో ప్రజాప్రతినిధులకు, ఆర్థిక శాఖ అధికారులకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం రేవంత్‌ రెడ్డి కూడా హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో రూ. 2,91,159 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత ఫిబ్రవరి నెలలో లోక్‌సభ ఎన్నికల ముంగిట మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్రప్రభుత్వం, ఇవాళ అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను తీసుకువచ్చారు. ఇందులో ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతుభరోసా, సంక్షేమ రంగాలకు సింహభాగం నిధులను కేటాయించారు. ఇటీవల ప్రకటించిన కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయి చూపినవేళ, కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేలా అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.