CID Searches in AP Beverages Former MD Vasudeva Reddy Office : ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కార్యాలయంలో సీఐడీ సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు కొనసాగిన తనిఖీల్లో సీఐడీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని మద్యం కంపెనీలకే అధికంగా కొనుగోలు ఆర్డర్లు ఇచ్చినట్టు గుర్తించారు. గత ప్రభుత్వంలో మద్యం బాటిల్ బేసిక్ ధరను పెంచి కొందరు పెద్దలు అనుచిత లబ్ధి పొందారని దర్యాప్తులో తేలింది. మద్యం లావాదేవీలకు సంబంధించిన పత్రాలను ఫైనాన్షియల్ ఆడిటింగ్‌కు పంపి విశ్లేషించే యోచనలో సీఐడీ అధికారులు ఉన్నారు. బినామీ మద్యం కంపెనీలపై ఇప్పటికే సీఐడీ కేసు నమోదు చేసింది.
ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ కార్యాలయంలో సీఐడీ సోదాలు - పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 26, 2024, 6:58 PM IST